Shirdi Sai Baba: ఇలాంటి కలలు వస్తే కచ్చితంగా షిరిడీ వెళ్లాల్సిందే.. సాయి బాబే స్వయంగా పంపించే సూచనలు!
అయితే ప్రతి ఒక్కరు కోరుకున్నట్టుగాను శిరిడి వెళ్లాలంటే అంత ఆశ మాస కాదు. కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా షిరిడి వెళ్లడానికి కుదరకపోయేది. మరి కొంతమంది అనుకోకుండా ప్రయాణాలు చేసి మరి శిరిడి చేరుకొని సాయిబాబా పూజలు అందుకుంటారు. ఒక్కసారైనా సరే జీవితంలో బాబా గారి దర్శనం చేసుకుంటే సాయిబాబా కచ్చితంగా అందరిని గ్రహిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం.
అలాగే శ్రీ షిరిడి సాయిబాబా సినిమాలు చూపించినట్టుగానే ఎన్నో మహిమలు గల సాయిబాబా ఆ ఊరిని అలాగే ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునే తీరుని సినిమాలో చక్కగా చూపెట్టడం కూడా మనం చూసే ఉంటాం. ఎన్నో రోగాలకు అలాగె జబ్బులను కూడా చిటికెలో న్యాయం చేయగల ప్రతిమ సాయిబాబకు కలదు. సాయిబాబా షిరిడికి రప్పించుకోవడానికి మనుషులకు కలలో మనకి కొన్ని సంకేతాలు ఇచ్చేటువంటివి పంపిస్తూ ఉంటారు. కానీ మనము అర్థం చేసుకోలేము.
మీరు విన్నది అక్షరాల సత్యం. ఎవరికైనా సరే కలలో సాయిబాబా గురించి ఎటువంటివి వచ్చినా సరే వెంటనే షిరిడి కి వెళ్లి సాయిబాబాని దర్శించుకోవాలని అందరూ అంటూ ఉంటారు. అవును ఇది నిజమే. శ్రీ శిరిడి సాయిబాబా స్వయంగా కొన్ని సంకేతాలను మన మనుషులకు కలలో పంపిస్తారట. అలాంటివి కొన్ని సంకేతాలు వచ్చినప్పుడల్లా మనం షిరిడి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలట. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా మనం కాకపోయినా మన చుట్టుపక్కల ప్రజలు చాలామంది శిరిడి వెళ్లి దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే మనకి కలలో కూడా మన ఇంటి పక్క వాళ్ళు లేదా మన బంధువులు ఎవరైనా సరే మనకి కలలో వచ్చి మేం షిరిడీ వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అని కలలో కనుక అడిగితే కచ్చితంగా ఇది సాయిబాబా పంపించే సంకేతమని కొంతమంది శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సంకేతాలు కూడా సాయిబాబా కలలో పంపిస్తాడట. అలాగే బాబా గారి షిరిడి హారతి మనకు అప్రయత్నంగానే వినిపిస్తూ ఉంటుంది.
ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎటు నుంచి వస్తుంది అనేది కూడా మనకి అర్థం కాదు. ఇలా కనుక మనకి వినిపిస్తూ ఉంది అంటే కచ్చితంగా అది షిరిడి సాయిబాబా షిరిడి రప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అని అంటున్నారు. తద్వారా మనం షిరిడి వెళ్లాలని సాయిబాబా కోరుకుంటున్నాట్లు చెబుతున్నారు. అలాగే శిరిడి సాయిబాబా యొక్క విభూది గాని ఫోటో గాని ప్రసాదం గాని లేదా విగ్రహం గానీ ఏదైనా గురువారం నాడు మన ఇంట్లోకి ప్రవేశం అయ్యింది అంటే అది బాబా గారే స్వయంగా మనల్ని షిరిడి వెళ్లి దర్శించుకోవాలని కోరుతున్నట్లుగా భావించాలి.
ప్రస్తుతం ఎవరైనా సరే సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది కష్టాల్లో అలాగే బాధలో ఉన్నప్పుడు మాత్రం శిరిడి వెళ్లడానికి ప్రయత్నం చేయరు. అయితే ఇలా చేయడం సరి కాదని ప్రతి మనిషి కష్టాలు మరియు నష్టాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో కూడా షిరిడి సాయిబాబా దర్శించుకోవాలని చాలామంది పూజారులు అలాగే శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే శిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్లేటప్పుడు మాత్రం ఇలాంటి కొన్ని అలవాట్లు అనేవి మానుకోవాలి.
అందులో ముఖ్యంగా ఒక పద్ధతి అయితే పాటించాలి. ఎప్పుడైతే మనం అప్పు చేసి మరి షిరిడి సాయి వెళ్తాము అది ఆ మనిషికి మంచిది కాదట. అప్పు చేసి శిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్ళినా సరే ఆ దర్శనం అంతగా సాగుదట. దీంతో ఎప్పుడైతే స్వయం ఖర్చుతో తమ యొక్క సంపాదనతో ఇప్పుడైతే శిరిడికి వెళ్తారో అప్పుడే ప్రయోజనం కలుగుతుందని చాలామంది చెప్తూ ఉన్నారు.
అలాగే కలలో సాయిబాబా కనుక మన చేయి పట్టుకుని షిరిడి కి తీసుకెళుతున్నట్లుగా కలలు మాత్రం వస్తే ఖచ్చితంగా శిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సాయిబాబా చరిత్రలో ఉంది. ఇలాంటి సమయంలో నె కుటుంబం అంతా కలిసి సాయిబాబా దర్శనం చేసుకోవాలని అంటున్నారు. అయితే మనం శిరిడి సాయిబాబా సినిమాలో చూసినట్లుగా ఎన్నో ప్రతిమలు గల దేవుడు సాయిబాబాగా కనిపిస్తాడు.
అలాగే ఈ సాయిబాబా కి కుల మతాల భేదాలు అనేవి అసలు లేవు. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడం వల్ల పుణ్యమే దక్కుతుందని చాలామంది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఎవరికైనా సరే నీ కష్టాలైనా లేదా బాధలైనా వస్తే అలాగే ఎవరైనా ఆరోగ్యంతో బాధపడుతున్న సరే వాళ్ల సమస్యలు ఎన్ని రోజుల్లోనే తీరుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. మరి మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న సరే మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబాని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు.