Coconut: విమానాల్లో కొబ్బరికాయలు తీసుకెళ్లడానికి నో పర్మిషన్?.. ఎందుకంటే..?
విమానంలో ఏది పడితే అది తీసుకెళ్లడానికి అసలు వీలు కుదరదు. మరి ముఖ్యంగా హిందువులు అతి పవిత్రంగా భావించే కొబ్బరికాయలను విమానములో తీసుకెళ్లడం నిషేధం.ఎందుకంటే అది చాలా ప్రమాదం. కొందరు కొబ్బరి ప్రసాదం విదేశాల్లోని తమ పిల్లలకు తీసుకెళ్లాలని చాలామంది అనుకుంటారు కానీ విమానంలో అవి తీసుకెళ్లడానికి ఒప్పుకోరు.
ఎందుకంటే కొబ్బరికాయలు అధిక మొత్తంలో నూనె అనేది ఉంటుంది. ఇక విమాన ప్రయాణాల్లో ఇది పేలుడు స్వభావం కలదు కాబట్టి విమానం లోపల వేడిని తాగితే ఎండు కొబ్బెర స్పార్క్ కూడా తొందరగా మండుతుంది. కాబట్టి ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. అంతేకాకుండా కొబ్బరి పై ఉండేటువంటి పీచు కూడా మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయలను విమానంలో తీసుకెళ్లడానికి ఒప్పుకోరు. అయితే కొన్ని విమాన సంస్థలు మాత్రం చిన్న చిన్న కొబ్బరి ముక్కలను తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇస్తాయి.
చాలామంది శబరిమల వెళ్లేవారు విమానాల్లో వెళుతూ ఉంటారు. మరి వీళ్ళు కొబ్బరితో ఇరుముడి కట్టుకుంటారు కాబట్టి కొన్ని విమాన సంస్థలు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. ఇక సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, పప్పు దినుసులు, మాంసం మరియు చేపలు ఇవన్నీ కూడా విమానాలలో తీసుకెళ్లనివ్వరు. వీటిని ఎప్పుడు విమానాలను తీసుకెళ్లడానికి నిషేధించారు.