Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే ట్రైన్!... మన భారతదేశంలోనే?
అంతేకాకుండా మన దేశంలో త్వరలోనే హైపర్ లూప్ రైలు కూడా రాబోతున్నాయట. విమానం కంటే డబల్ స్పీడ్ తో ఈ రైళ్లు వెళ్తాయని పేర్కొన్నారు. ఈ రైలు కోసం ఏకంగా ఐఐటి మద్రాస్... ఈమధ్య 410 మీటర్ల టెస్ట్ ట్రాక్ ను తన డిస్కవరీ క్యాంపస్లో నిర్మించిందట. ఇక ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వేకి సహాయం చేస్తుండగా దీనిద్వారా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే హైపర్ లూప్ రైలు టెస్ట్ చేయవచ్చని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టును TUTR హైపర్ లూప్ ఇండియాతో పాటుగా స్వీస్ పాడ్ టెక్నాలజీ తో కలిసి చేపడుతున్నారట. కాబట్టి త్వరలోనే ఇండియాలో వాణిజ్య రూట్లలో హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వస్తుందట.
అయితే ఈ హైపర్ లూప్ రైలు అనేవి గంటకు ఏకంగా 1200 కిలోమీటర్ల వేగంతో వెళ్లగల సత్తా ఉందట. కానీ ఇవి ప్రస్తుతం ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా ఉంటాయని వీటికి కేవలం ఒక భోగి మాత్రమే ఉంటుందట. ఇక ఉదాహరణకి ఒకసారి సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే పావుగంటలో విజయవాడ మరో పావుగంటలో విశాఖపట్నం కూడా వెళ్లగలదట. ఇక ఇండియాలో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 600గా నిర్ణయిస్తున్నారు. ఇక ఏది ఏమైనా సరే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు కేవలం ఒక గంటలో వెళ్తుంది.