Fake Currency Notes: ఎక్కడ చూసినా నకిలీ నోట్లు?... వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రతిదీ నకిలీమయంగానే ఉంది. చివరికి ఈ కేటుగాళ్లు కరెన్సీ నోట్లను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఒక్కొక్కసారి నకిలీ అని అనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో భయపడాల్సి వస్తుంది. ఇక 2018-19 వ సంవత్సరంలలో ఏకంగా 21865 మిలియన్ నకిలీ నోట్లు ఉన్నాయని పార్లమెంట్లో సమర్పించిన గణంకాల ప్రకారం తెలిసింది.
ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు రద్దుచేసి కేవలం 500 రూపాయలు, 200 రూపాయలు, వంద రూపాయలు మరియు 50 రూపాయల నోట్లను వాడుకలో ఉంచారు. కాబట్టి ఎక్కువగా 500 రూపాయల నోట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం వాడుతున్న నోటు అసలైనదా లేదా నకిలీదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
500 రూపాయల నోటు కొలతలు 22mm× 150mm ఉంటుంది. అలాగే ఈ నోటిఫై దేవా నాగరి లిపిలో 500 రూపాయలను ముద్రించి ఉంటుంది. అలాగే నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రము అనేది ఉంటుంది. చిన్నచిన్న అక్షరాలతో భారత్ మరియు ఇండియాని రాసి ఉంటుంది. అలాగే మనం 500 రూపాయల నోటు వంచినప్పుడు ఆకు పచ్చ రంగు త్రెడ్ అనేది నీలం రంగుకు మారుతుంది. అలాగే ఈ నోటిఫై గవర్నర్ సంతకం, కుడివైపున మహాత్మా గాంధీ చిత్రంలో ఆర్బిఐ చిహ్నం ఉంటుంది.
ఇక నోటు ఎడమవైపు కుడి కింద భాగంలో నెంబర్ ప్యానల్ అనేది ఉంటుంది. నోటి కుడి వైపున అశోక స్తంభం చిహ్నం అనేది ఉంటుంది. 500 రూపాయల నోటు ఎడమవైపున నోటు ముద్రించిన సంవత్సరము ఉంటుంది. ఇక అంతేకాకుండా నోట్లో స్వచ్ఛభారత్ లోగో అలాగే నినాదం అనేవి ఉంటాయి. ఇలా ఉన్నట్టయితేనే ఇది అసలు నోటు అని అర్థం చేసుకోవాలి. వీటిలో ఏది మిస్ అయినా అది నకిలీ నోటు అనే నిర్ధారించుకోవాలి.