Pharmacy Shop: ఈ బిజినెస్ లో లాభాలు ఎక్కువ.. నష్టాలు తక్కువ ? ఎలాగో ఒకసారి తెలుసుకోండి
అయితే ఇలాంటి వారందరికీ కూడా మెడికల్ రిటైల్ వ్యాపారం వైపు ఒకసారి మళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మందుల రిటైల్ వ్యాపారం అనేది ఇప్పుడు కూడా లాభాలు బాటలోనే జరుగుతుంది. మెడికల్ స్టోర్ పెట్టుబడి పెట్టి ప్రారంభిస్తే ఖచ్చితంగా మంచి లాభాలు ఉంటాయని కొంతమంది బిజినెస్ మ్యాన్స్ చెప్తున్నారు. మెడికల్ స్టోర్ ప్రారంభించాలంటే కచ్చితంగా మందులు, లైసెన్సు ఫీజులు, సెటప్ ఖర్చులు కలిపి మొత్తం కూడా ఐదు నుంచి పది లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది.
మీరు మందులను రిటైల్ గా అమ్మినప్పుడు మీకు 16 నుండి 25% లాభాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మీరు మందులను హోల్సేల్ ధరలకు అమ్మినప్పుడు మీకు ఇంకా ఎక్కువ 30 నుండి 40% వరకు లాభం వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఫ్రాన్సిస్ ను తీసుకొని మెడికల్ స్టోర్ ను పెట్టుకోవాలి. అలాగే ఈ మెడికల్ స్టోర్ తెరిచేటప్పుడు నియమాలు మరియు చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలి. అలాగే ఇందులో తప్పుడు మందులు విక్రయించిన లేదా అమ్మిన కచ్చితంగా నిబంధనలను తప్పినట్లు అవుతుంది. కాబట్టి మీ లైసెన్స్ అనేది రద్దు చేయవచ్చు.
కాబట్టి మీరు కనుక ఏమి చదవకపోయినట్లయితే మీ దగ్గర పెట్టుబడి కి డబ్బులు ఉన్నట్లయితే మీరు అర్హత కలిగిన ఫార్మసిస్టును నియమించుకొని మెడికల్ స్టోర్ తెచ్చుకోవాలి. కచ్చితంగా డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ నుండి లైసెన్స్ అనేవి తెచ్చుకోవాలి. మరో విధంగా ఖచ్చితంగా జీఎస్టీ నమోదు అనేది చేయించాలి. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే కచ్చితంగా మీరు మెడికల్ స్టోర్ అనేది పెట్టుకోండి. మీరే ఒక మెడికల్ చదివినటువంటి మనిషి అయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. లేదంటే ఫార్మసిస్ట్ ని పెట్టుకొని మీ స్టోర్ అనేది రన్ చేసుకోవచ్చు.