Fake Apps: నకిలీ యాప్ లు వాడడంలో భారతీయులే అగ్రస్థానం?.. దయచేసి జాగ్రత్త!
సైబర్ నేర్గాలు ఈ నకిలీ యాప్స్ ను సృష్టించి పెద్ద ఎత్తున మనుషుల యొక్క డేటాను దొంగలించడం తోపాటు వారిని ఇబ్బందులుకు కూడా గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రైవేటు ఏజెన్సీ MCAFEE కీలక నివేదికను ఇవాళ విడుదల చేసింది. నివేదికల ప్రకారం మన భారతదేశంలో ఎక్కువగా నకిలీ రుణ యాప్లను ఇన్స్టాల్ చేస్తున్నారని అంతేకాకుండా మన భారతీయుల ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఈ నకిలీ యాప్ లను డౌన్లోడ్ చేస్తున్నారని స్పష్టం చేసింది.
చాలామంది త్వరగా లోన్లు పొందవచ్చును భావించేవారు యాప్ యొక్క విధివిధానాలు తెలుసుకోకుండా వెంటనే డౌన్లోడ్ చేస్తున్నారని ఇదే అణువుగా తీసుకొని సైబర్ మోసగాళ్లు మనుషులు యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అలాగే బ్యాంకింగ్ వివరాలను డేటా తో సహా ఎలాంటి అనుమతులు లేకుండా దొంగలిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన 15 అప్లికేషన్లను ఎనిమిది మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఈ ఎంసీఏఫీ ప్రైవేట్ ఏజెన్సీ కీలక నిర్ణయాలను బయటకు వెల్లడించింది.
ఈ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం వల్ల వినియోగదారు యాప్ లోనే అనేక అనుమతులు అనేవి మనం తెలియకుండానే ఇస్తాం. కాబట్టి ఈ యాప్ లను చాలామంది కూడా ఎవరికీ తెలియకుండా వివిధ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఏది కూడా గుడ్డిగా నమ్మకుండా తెలిసిన యాప్లను మాత్రమే వాడండి.