Barrelakka Marriage: పెళ్లి పీటలెక్కిన బ‌ర్రెల‌క్క‌.. వరుడితో సోష‌ల్ మీడియాలో రియాక్షన్ వైర‌ల్‌..

Barrelakka Marriage: పెళ్లి పీటలెక్కిన బ‌ర్రెల‌క్క‌.. వరుడితో సోష‌ల్ మీడియాలో రియాక్షన్ వైర‌ల్‌..

Barrelakka Marriage: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్లాట్ ఫామ్ ని వాడుకొని ఎంతమంది ఫేమస్ అవుతున్నారో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలో కొందరు చాలా రోజులకు ఫేమస్ అయితే మరికొందరు మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు.

ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ లో మంచి క్రిజ్ సంపాదించుకున్న వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు అని చెప్పాలి. అయితే బర్రెలక్క నిరుద్యోగం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఈ ఒక్క వీడియోతో ఆమె ఓవర్ నైట్ లోనే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

అనంతరం బర్రెలక్క కాస్త సోషల్ మీడియా ఇన్ఫ్లియన్స్ గా మారింది. అయితే బర్రెలక్క నిరుద్యోగం గురించి చేసిన ఆ వీడియోలో ఆమె బర్రెలు కాస్తూ , తెలంగాణలో డిగ్రీ పూర్తి చేసిన నేను బర్రెలు కాసుకుంటున్నాను అంటూ తెలియజేశారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

ఈ వీడియో పై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందించారని బెదిరింపులు కూడా వచ్చాయని పలు సందర్భాలలో బర్రెలక్క చెప్పడం జరిగింది. ఆ విధంగా చిన్న వీడియోతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క ఎవరు ఊహించని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.

Read Also మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

284 -1

ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో బర్రెలక్క గా మంచి గుర్తింపు పొందింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎంతోమంది యువతలో ఆమె స్ఫూర్తి నింపిందని చెప్పాలి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సరే లోక్ సభ  ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు.

తాను ఓడిపోయిన పర్వాలేదు కానీ తన పోటీ నేటితరం యువతను మేల్కొల్పాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నిరుద్యోగుల కోసం తాను ఎల్లపుడు గొంతు ఎత్తుతానని ఒక నిరుద్యోగి తలచుకుంటే ఏదైనా చేయగలరనే విషయాన్ని అందరికీ నిరూపించి చూపిస్తానని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తగ్గేదేలేదంటూ ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను ఎంపీగా అవసరమైతే ఎమ్మెల్యేగా బరిలో దిగుతానంటూ చెప్పుకొస్తున్నారు.  ఈ విధంగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో హార్ట్ టాపిక్ గా మారిన బర్రెలక్క ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల బర్రె లెక్క వెంకటేష్ అనే ఓ యువకుడి పెళ్లి చేసుకున్నారు.  వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వారి ప్రీ వెడ్డింగ్ షూట్ మరియు ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

284 -2

ఇక వీరి ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే సినిమా షూటింగ్ కి ఏ మాత్రం తీసిపోదని చెప్పాలి. ఈ పెళ్లి వేడుకలో బర్రెలక్క ఎంతో అందంగా ముస్తాబయి పెళ్లి పీటలపై కూర్చుంది. వేదమంత్రాలు సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు స్నేహితులు హాజరయ్యారు.

అయితే ఈ పెళ్లి వేడుకలో మండపంపై వరుడు వెంకటేష్ బర్రెలక్కను ముద్దు పెట్టుకున్నాడు. వరుడు ముద్దు పెట్టుకోగానే బర్రెలక్క కూడా సంతోషం వ్యక్తం చేసింది. వరుడు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా వారు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా బర్రెలక్క బంధుమిత్రుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?