భూ భారతిపై అవగాహన కల్పించాలి  : కలెక్టర్ నారాయణ రెడ్డి

భూ భారతిపై అవగాహన కల్పించాలి  : కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17, (క్విక్ టుడే న్యూస్) : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్‌డిఓ సంగీత‌, ఆర్డీఓలు అనంత‌రెడ్డి, చంద్ర‌క‌ళ, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, వెంక‌ట్ రెడ్డి, మున్సిప‌ల్ క‌మిష‌నర్లు,  మండ‌లాల ఎమ్మార్వోలతో  భూ భార‌తి, కొత్త ఆర్ ఓఆర్ చట్టం అమ‌లుపై  మంగ‌ళ‌వారం కలెక్టరేట్ లోని స‌మావేశం మందిరంలో ఆయన స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)- భూమి హక్కుల రికార్డు,  భూ భారతి - కీలక అంశాలు,  భూ భారతి  - ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు,  ఆర్.ఓ.ఆర్. లో తప్పుల సవరణ,  వ్యావసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్,  సాదా బైనామాల క్రమబద్దీకరణ,  పట్టాదారు పాసుపుస్తకాలు,  అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, న్యాయ సహాయం,  గ్రామా రెవెన్యూ రికార్డులు వంటి ప‌లు అంశాల‌పైన రెవెన్యూ అధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. 

                        భూమిపై ఎవ‌రికి, ఎలాంటి హ‌క్కుల వివ‌రాలు, గ్రామాల వారీగా భూ య‌జమానులు, వారి భూమి వివ‌రాల‌ను తెలిపే రికార్డు అని అన్నారు. అంతే కాకుండా దీన్ని భూ య‌జ‌మానుల రికార్డు కూడా అన వచ్చని తెలిపారు. నేటి నుంచి ప్ర‌తి భూమి రిజిస్ర్టేష‌న్ ఈ రికార్డు ఆధారంగానే జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం రైతుల‌కు చేసే మేలు ఏ కార్యక్రమం, పథకమైనా దీని ప్ర‌కార‌మే అమలు చేస్తారన్నారు. ఈ రికార్డులో పేరు ఉన్న వారికే భూ యాజ‌మాన్య హ‌క్కు ప‌త్రం, ప‌ట్టాదారు పాసుపుస్త‌కం ఇవ్వనున్నట్లు వివరించారు. 
                          జిల్లాలో  వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకురాబోతుంద‌ని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, కాబట్టి ప్ర‌తి ఒక్క రైతు, పౌరుడికి ప్ర‌ణాళిక రూపంలో వివ‌రించాల‌న్నారు.
పైలట్ ప్రాజెక్టుగా భూ భారతిని జిల్లాలో చేప‌ట్ట‌డానికి ముందుగా 8 నియోజ‌క‌ర్గాల్లో అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌న్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజక‌వ‌ర్గం, రెవెన్యూ డివిజ‌న్, మండ‌లం, ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పూర్తి స్థాయిలో రైతుల‌కు అవ‌గాహ‌న కల్పించాలన్నారు. ప్ర‌భుత్వ అధికారులు, వివిధ శాఖ‌ల అధికారుల  సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయ‌డం కోసం క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌ని సూచించారు.

Read Also ఘనంగా పామ్ సండే పండుగ!..

IMG-20250416-WA0050

Read Also ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?