విద్యుత్ సంస్థలొ పనిచెస్తూన్నా అర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలి

విద్యుత్ సంస్థలొ పనిచెస్తూన్నా అర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలి

శివ్వంపేట,ఏప్రిల్ 17 :-  తూప్రాన్ లోని పోతారాజ్ కామన్ వద్ద తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం టీ ఎస్ యు ఇ ఇ యు - యూనియన్ యూనియన్ అధ్యక్షులు యం. నర్సింలు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా టీ ఎస్ యు ఇ ఇ యు - యూనియన్ యూనియన్ అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని విద్యార్హతను బట్టి వారికి సబ్ ఇంజనీర్, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్టేనేట్ పోస్టులని ఇవ్వాలని అనేక దపాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నామని, గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలొ కార్మికులకు హామీ ఇచ్చారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది 20వేల మంది ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.అలాగే శాశ్వత ఉద్యోగులకు ఈపీఎఫ్ టు జిపిఎఫ్, అధిక పని భారాన్ని తగ్గించాలి,సాస యాప్ కి సంబంధించిన వాటికి న్యూ మొబైల్ ,నెట్ బ్యాలన్స్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  శాశ్వత ఉద్యోగుల సమస్యలతో పాటు అర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్తులో మెరుపు సమ్మెకు కూడా వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల మార్పులకు వ్యతిరేకంగా మే 20న దేశ వ్యాప్త సార్వతి క సమ్మెను మెదక్ జిల్లాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడల రవీంద్ర ప్రసాద్,సురేష్,జీవన్, రాజిరెడ్డి,శ్రీను,సలీం,దుర్గయ్య, సిద్ధి రాములు, బిక్సపతి తదితరులు పాల్గొన్నారు.IMG-20250417-WA0026

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?