కాంగ్రెస్ గూటికి సోమేశ్వరరావు,రాజేష్ నాయక్?..పాలకుర్తిలో బీటలు వారుతున్న బీఆర్ఎస్ కోట

కాంగ్రెస్ గూటికి సోమేశ్వరరావు,రాజేష్ నాయక్?..పాలకుర్తిలో బీటలు వారుతున్న బీఆర్ఎస్ కోట

పాలకుర్తి, ఏప్రిల్ 18:- పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయా?... గులాబీ పార్టీ కీలక నాయకులు పార్టీ మారబోతున్నారా?.... మాజీ మంత్రి ఎర్రబెల్లికి కుడి భుజంగా ఉన్న నాయకులు కారు దిగుతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరులు, తొర్రూరు మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ డాక్టర్ ధరావత్ రాజేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర రావు లు పార్టీ మారెందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.అతి త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.దీంతో పాలకుర్తి నియోజకవర్గం లో పాలిటిక్స్ కొత్త రూపు సంతరించుకోనుంది.  పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు  ఆయువు పట్టుగా ఉన్న తొర్రూరు ఒక్కొక్కరు కారు దిగి హస్తం పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్, డాక్టర్ సోమేశ్వరరావు లు బీఆర్ఎస్ ను వీడుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ మారుతున్న విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దయాకర్ రావు వారితో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ వారు బీ ఆర్ఎస్ లో కొనసాగేందుకు సుముఖంగా లేమని తేల్చినట్లు తెలుస్తోంది.డాక్టర్ రాజేష్ నాయక్  తొర్రూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా కొనసాగి దయాకర్ రావు ముఖ్య అనుచరునిగా పేరుందారు. ఆయన సహకారంతో దయాకర్ రావుకు గిరిజన, లంబాడా ప్రాంతాల్లో మంచి మద్దతు లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ పూర్తి చేసిన రాజేష్ నాయక్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జెఏసి చైర్మన్ గా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించారు. ఎన్నో సామాజిక ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించారు. తదనంతరం నవ తెలంగాణ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా సైతం కొనసాగారు.డాక్టర్ సోమేశ్వర రావు సైతం దయాకర్ రావుకు నమ్మిన బంటుగా రాజకీయాల్లో ఆయన వెన్ను తట్టారు. ప్రతి ఎన్నికల్లో దయన్న గెలుపుకు కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. గెలిచేంతవరకే నాయకులను దగ్గర ఉంచుకొని గెలిచాక ఆయనను పూర్తిగా విస్మరించాడనే ప్రచారం ప్రజల్లో ఉంది. ఆయన స్థాయికి తగ్గ పదవీ, గౌరవం ఇవ్వలేదని ప్రజల్లో భావన ఉంది.అనామకులకు కీలక బాధ్యతలు, పదవులు అప్పగించిన ఎర్రబెల్లి సోమేశ్వరరావుకు ఏ పదవి ఇవ్వడానికి ఇష్టపడ లేదని ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా డాక్టర్ రాజేష్ నాయక్, డాక్టర్ సోమేశ్వర రావులు బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.ఈ సమయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలు వీరి ప్రాధాన్యతను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఇదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజా బలం ఉన్న ఈ నాయకులతో హస్తం పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IMG-20250418-WA0045

Read Also మహిళల విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?