అంబేద్కర్ జయంతి సందర్భంగా శివ్వంపేట కాంగ్రెస్ నేతల పాదయాత్ర

అంబేద్కర్ జయంతి సందర్భంగా శివ్వంపేట కాంగ్రెస్ నేతల పాదయాత్ర

శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శివ్వంపేట మండలంలో “జై బాబు - జై భీమ్ - జై సమ్మిదాన్” నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న గొట్టిముక్కల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడంతో కార్యక్రమానికి శుభారంభం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు చిన్న గొట్టిముక్కల ప్రధాన రహదారి నుంచి గోమారం గ్రామం వరకు భారీ పాదయాత్రను నిర్వహించారు. చెన్నాపూర్ మరియు గోమారం గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలతో నివాళులు అర్పించారు.పాదయాత్ర అనంతరం గోమారం గ్రామానికి చెందిన లబ్ధిదారుడు రాజు యాదవ్ ఇంట్లో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితర నేతలు భోజనం చేశారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమాన్ని కొనియాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న చొరవను గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసిని రెడ్డి, శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, పులిమామిడి నవీన్ గుప్తా, లావణ్య మాధవరెడ్డి, చింతల కర్ణాకర్ రెడ్డి, లక్ష్మీకాంతం, కమలాపూర్ సింగ్, బండారి గంగాధర్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250414-WA0102

Read Also అంతరాలు లేని విద్యను అందించడమే యుటిఎఫ్ లక్ష్యం!..

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?