మాదకద్రవ్యాల నియంత్రణ పోలీస్ శాఖ మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలి!...
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీఐ గణేష్,ఎస్సై ఉపేందర్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ గణేష్ మాట్లాడుతూ...మానవ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మాదకద్రవ్యాల వినియోగం ఒకటని, అది నేటి యువతను నశింపజేస్తున్న ఒక విష వలయం అని దాన్ని ఛేదించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అంతేకాకుండా మాదగద్రవ్యాల వినియోగం వ్యక్తిని మానసికంగా శారీరకంగా నాశనం చేస్తుందని, ఇది ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాన్ని సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు దీని పట్ల అప్రమత్తంగా ఉండేందుకు కుటుంబ సభ్యులు పిల్లలపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఎస్ఐ ఉపేందర్ మాట్లాడుతూ...యువత డిప్రెషన్ ఒత్తిడి వంటి పరిస్థితుల్లో కి వెళ్లి ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఇటీవల మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో కూడ పెరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ఒక పోలీస్ శాఖ మాత్రమే కాదు,ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలని వారు పిలుపునిచ్చారు. స్కూలు కళాశాలలు నియమితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో జ్ఞానం, జాగ్రత్త పెంచాలని కోరడమే కాకుండా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఉపాధ్యాయులను, కళాశాల బాధ్యులను కోరారు.ఇప్పటికే మార్గద్రవ్యాలకు బానిసైన వారు సమాజానికి తిరిగి వచ్చేందుకు వారికి అవసరమైన కౌన్సిలింగ్ సేవలు,, పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, అందుకు తగ్గట్లుగా వారి మానసిక ఆరోగ్య కోసం వైద్యులు, సామాజిక కార్యకర్తలు కలిసి పనిచేయాలని సమాజంలో చైతన్యాన్ని కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాల్సిన అవసరం విద్యాసంస్థలకే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థల నిర్వాహకులపై కూడా బాధ్యత ఉందన్నారు. అనంతరం సిఐ.గణేష్, ఎస్సై ఉపేందర్ లు మాదకద్రవ్యాల నియంత్రణ గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్స్ సమన్వయకర్త డాక్టర్ పార్వతి, అధ్యాపకులు శాంతి కుమార్, రవీందర్ రెడ్డి, వాల్య నాయక్, సునీల్,అంజుమ్ ఆరా, కృష్ణవేణి, శ్రీనివాస్,విజయ్,రాధిక,రజిత తోపాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.