మూల ఆదివాసీలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి
ఆదివాసులకు (ఎస్టి) కులం సర్టిఫికెట్లు తక్షణమే మంజూరు చేయాలి
మూల ఆదివాసిలంతా ఐక్యంగా ఉద్యమించాలి
మూల ఆదివాసి గిరిజన సంఘం మరియు సిపిఐ(ఎంఎల్) ప్రజాపంద పార్టీ
ఈ సందర్భంగా మూల ఆదివాసి గిరిజన సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు రేగ ఆంధ్రయ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండ చరణ్ లు మాట్లాడుతూ మూల ఆదివాసులు గిరిజనులు కాదు అంటూ ప్రభుత్వ అధికారులు కులం సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్లు నిలిపివేయడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కోడి భూములకు పట్టాలి ఇవ్వకుండా మూల ఆదివాసులను ప్రభుత్వాలు అరిగోస పెడుతున్నాయని అన్నారు. బ్రతుకుతెరువు కోసం వచ్చిన ఆదివాసులపై ప్రభుత్వాలు కక్ష కట్టినట్లు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి నట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే సంబంధిత అధికారులు మూల ఆదివాసీల సమస్యల పరిష్కారంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని కోరారు.
అలాగే వలస ఆదివాసి గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని, అలాగే పోడు భూములకు అక్కుపత్రాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముడియం రామయ్య, ఎలకమ్ రామయ్య, కురసం గణపతి, వెంకటేష్, బండారి యాకోబ్, మడకం బాబురావు, బాయమ్మ, జములు, జోగయ్య, లక్ష్మయ్య, బుద్రయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.