ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులాల సర్వేపై కుల గణన ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులాల సర్వేపై చేస్తున్న సమగ్రమైన సర్వేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు కూడా భాగ్యస్వాములు కావాలని అన్నారు. కాంగ్రెస్ నేత పెద్దలు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలోనే కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పునగరంలో ప్రజలందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అప్పుడే మనం అనుకున్న సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు కుల గణన పైన సందేహాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, నాయకులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారని,తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అన్ని విభాగాల చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.