Nandi and Lord Shiva: శివుడి వాహనంగా నంది ఎందుకు ఉండాలి?.. నంది ఎవరి తనయుడో తెలుసా?

Nandi and Lord Shiva: శివుడి వాహనంగా నంది ఎందుకు ఉండాలి?.. నంది ఎవరి తనయుడో తెలుసా?

Nandi and Lord Shiva: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శివుడిని దేవుడుగా కొలుస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఒక ఊర్లోను శివాలయం ఖచ్చితముగా ఉంటుంది. ఆ శివాలయంలో శివుని విగ్రహానికి ఎదుటగా నంది విగ్రహం అనేది కచ్చితంగా ఉండాల్సిందే. అయితే దీని వెనుక చాలానే పురాణం దాగి ఉందట. అసలు శివుడి దేవాలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుంది?..  

అసలు నందీశ్వరుడు అంటే ఎవరు?  ఎవరి తనయుడు? శివుడికి వాహనం లాగా నంది ఎందుకు మారాడు? అనే చాలా ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం.  మనం ప్రస్తుతం ఏ శివాలయంలో చూసుకున్నా సరే శివుని విగ్రహం ఎదుట గా శివలింగం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ శివలింగం ఎదుట కూడా నందీశ్వరుడు అనే నంది విగ్రహం అనేది కచ్చితంగా ఉండాల్సిందే.

Read Also Maha Kumbh Mela 2025: త్వరలోనే మహా కుంభమేళా ప్రారంభం?.... దీనికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే..?

ఇది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్న విషయమే. అలాగే చాలా సినిమాల్లో కూడా మనం శివుడికి నంది సహాయం చేసేటువంటి సన్నివేశాలను కూడా చూసి ఉండుంటాం. ప్రతి దేవాలయంలో శివుడితోపాటు శివలింగానికి అలాగే  నందీశ్వరుడు కూడా ఎంతోమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి నందీశ్వరుడు ఎవరో మీకు తెలుసా?..  అసలు నంది ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Diwali festival: ఆనందాల పండుగ‌ దీపావ‌ళి..ఆరోజునే దీపాలు వెలిగించి, టపాసులు ఎందుకు పేల్చుతారో తెలుసా?

19 -01
 నందీశ్వరుడు ఎవరు

 ప్రమద గణములకు నాయకుడు ఈ నందీశ్వరుడు. నందీశ్వరుడు శివుడు ఉండేటువంటి కైలాసానికి ద్వారపాలకుడిగా ఉండేవాడు.  అక్కడ శివుడికి వాహనంగానే కాకుండా అత్యంత ప్రీతికరమైన శివుడి భక్తుడిగా గాను పేరు పొందాడు  నందీశ్వరుడు. ఈ యొక్క నందీశ్వరుడుని శక్తి మరియు భక్తి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి కైలాసం లోనే శివుడికి వాహనంగా నంది ఉంది. తరతరాలుగా ఇప్పుడు మనం పూజించుకుంటున్న నంది వాహనమే ఆ నందీశ్వరుడు. 

Read Also Dussehra Story : దసరా వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా?

 నందీశ్వరుడు తండ్రి ఎవరు

 మన పురాణాల ప్రకారం పురాతన కాలంలో శిలాధుడు అనే రుషి ఉండేవాడట. ఆ రుషి ఎంతో ఘోరమైన తపస్సును చేసి శివుడివరాన్ని పొందుతాడు. నాకు నీలాంటి పరమా భక్తుడైనటువంటి కొడుకు కావాలని కోరుకుంటాడు. ఇక వెంటనే శివుడు నంది రూపంలోని బిడ్డను ఆ ఋషికి  జన్మను ఇచ్చేలా చూస్తాడు. ఇక ఆ ఋషి ఆ బిడ్డకు రంగాల్లోనూ నైపుణ్యం ఉండేలా పెంచుకోస్తూ ఉంటాడు. అలాగే వేదాలు మరియు పురాణాలు అన్నిట్లోనూ నైపుణ్యంగా పెంచుకొచ్చాడు. 

Read Also Chanakya Niti: ఈ నాలుగు ఇల్లు ఎప్పుడు పేదరికంలోనే ఉంటాయి.. చాణిక్యనీతిలో ఏం రాసి ఉందొ తెలుకోవ్వాల్సిందే.. 

 శివుడి వాహనంగా నంది ఎలా మారింది

 మన పురాణాల ప్రకారం  ఒకసారి ఇద్దరు మునులు శిలాధుడి ఆశ్రమానికి వస్తారు. ఆ సందర్భంలోనే నందీశ్వరుడు ఆ మునులు ఇద్దరికీ కూడా మంచిగా  అతిధి మర్యాదలు అనేవి చేస్తాడు. అప్పుడు శిలాధుడు ఆ మునులు ఇద్దరినీ మా కొడుకు దీర్ఘాయుడిగా   ఉండాలని ఆశీస్సులు ఇవ్వమని ఇద్దరు మునులు ను కోరుతాడు.  కానీ ఆ ఇద్దరు మునులు  ఆశీస్సులు ఇవ్వడానికి నిరాకరిస్తారు. 

Read Also Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

19 -02
అప్పుడు శిలాధుడు ఎందుకని అడగగా  మీ నందీశ్వరుడు  అల్పాయుష్కుడని  కాబట్టి మేము ఆశీస్సులు ఇవ్వలేమని చెప్పుకొస్తారు. ఆ మాటలు విన్న నందీశ్వరుడు చాలా బాధపడతాడు. ఇక ఆ శివుడి వరం కోసం ఘోరతపోస్తులను నందీశ్వరుడు చేస్తాడు. ఇక నందీశ్వరుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి శివుడు ఏకంగా దిగివచ్చి  ఇక నందీశ్వరుడు ని  శివుని వాహనంగా చేసుకుంటాడు శివుడు. ఇలా శివుని వాహనంగా నందీశ్వరుని శివుడు  తపస్సు ద్వారా చేసుకుంటాడు. ఇలా నంది అనేది శివుని వాహనంగా మారిపోయింది. 

శివాలయంలో నంది విగ్రహం  ఎందుకు ఎదురుగా ఉంటుంది

 మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శివాలయం ఎదుట నంది విగ్రహం అనేది కచ్చితంగా ఉండాల్సిందే. అలా ఎందుకు ఉంటుందంటే మన పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుని లింగానికి ఎదురుగా ఉండాలి. అలా ఎందుకు ఉండాలంటే నందీశ్వరుడు తన భక్తికి అలాగే శివుడి పై ఉన్నటువంటి శ్రద్ధకి ఎప్పుడు అబి ముఖంగానే ఉండాలని ప్రతి శివాలయంలోనూ నంది విగ్రహాన్ని శివలింగానికి ఎదుటి గా విగ్రహిస్తారు. నంది దృష్టి ఎప్పుడూ కూడా దైవమైనటువంటి శివుడి పై ఉండాలని ఆ నంది విగ్రహాలను అలా ఎదురుగా విగ్రహిస్తారు. 

 అలాగే ఎక్కువగా చాలామంది కూడా మనం  నంది చెవిలో మన కోరికలు అనేవి ఎక్కువగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడానికి కూడా చాలా రకాలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే పురాణాల ప్రకారం నంది చెవులు మన కోరికలు చెప్పుకోవడం అనేది మంచిదేనట. ఘోర తపస్సులో శివుడు లీనమై ఉన్నందున మన కోరికలను శివుడు పట్టించుకోడట. ఆ సమయంలోనే శివుడి వాహనమైన నంది చెవిలో మనం చెప్పుకుంటే ఆ తపస్సు తర్వాత  నంది నేరుగా వెళ్లి శివుడికి చెప్తారట. అందుకే మన కోరికలు ఏమైనా ఉంటే అవి నంది చెవిలో మాత్రమే చెప్పాలి. అవి ఆ తరువాత నంది శివుడికి చెప్పడంతో అప్పుడు ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి అని మన పురాణాల్లో రాసి ఉంది. 

19 -03

 ఇలా ప్రతి ఒక్కరు కూడా నంది విగ్రహా చెవిలోనే మన కోరికలు అనేవి చెప్పుకోవడం చాలా మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఇలాంటి  నంది విగ్రహాలు అనేవి కచ్చితంగా ఉండాల్సిందే. ఇవి ఏకంగా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఇలాంటి ఆచారం అనేది కచ్చితంగా ఉంటుంది.

ప్రతి ఒక్క గ్రామంలోనూ శివాలయం అనేది కచ్చితంగా ఉంటుంది కాబట్టి అందులో మనం ఇలాంటి సంఘటనలు చూసే ఉండుంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఇలా శివాలయంలోనే శివుని విగ్రహం ఎందుకు ఉంటుందని ఆలోచన కచ్చితంగా అందరికీ వచ్చి ఉంటుంది. 

కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన పురాణాల ప్రకారం చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి అందుకే ఇలాంటి ప్రశ్నలు అన్నిటికో మన పురాణాల్లో రాసి ఉంది కాబట్టి  ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. సామాన్యంగా శివాలయం కెళ్ళి ప్రతి ఒక్క భక్తుడికి కూడా విషయంపై ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నలు కలుగుతాయి. కాబట్టి మనం మన పురాణాలు ప్రకారం ముందుగానే తెలుసుకోవాలి. ఎవరైనా తెలియనటువంటి భక్తులను అడిగి తెలుసుకోవాలి.

19 -04
 ప్రతిరోజు మీరు శివాలయం కి వెళ్తారు కాబట్టి అక్కడ ఉండేటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కచ్చితంగా ఇలాంటి విషయాలు పక్కాగా తెలిసే ఉంటాయి. కాబట్టి మీరు వారిని అడిగి తెలుసుకోవడం వల్ల సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయం రహస్యాలన్నీ కూడా ఆ ఒక్క దేవాలయంలో ఉండేటువంటి  పూజారులు లేదా వేదమంత్రాలు చదివేటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాలపై పూర్తవగాహన అనేది ఉంటుంది. 

కాబట్టి మీరు వారి ద్వారా సులభంగా ఏ రహస్యాన్ని అయినా తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని మీ తోటి బంధువులకు అలాగే మిత్రులకు తెలియజేయండి. మన పురాణాల ప్రకారం మన హిందూ సాంప్రదాయాలు దేవాలయాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. అలాగే ఈ విషయాలన్నీ కూడా మన వారసత్వాలకు తెలియజేయడం కూడా మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఎవరైతే ఉంటారో   ఈ విషయాలు అనేవి తెలుసుకోండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?