Maha Kumbh Mela 2025: త్వరలోనే మహా కుంభమేళా ప్రారంభం?.... దీనికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే..?
2025వ సంవత్సరంలో జరిగే మహాకుంభమేళా అనేది జనవరి 13వ తారీకు నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహాకుంభం మొదటి రోజు సిద్ది యోగం ఏర్పడడం కూడా చాలా యాదృచ్ఛికంగా జరుగుతోందని వేద పండితులు ఇప్పటికే సమాచారం కూడా అందించారు. ఇక మహా కుంభమేళా అనేది హిందూ మతంలో వచ్చే అతి పెద్ద పండుగ కావడంతో ప్రపంచమంతా కూడా ఉన్న హిందువులందరూ కూడా ఈ మహా కుంభమేళా జాతరకు హాజరు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ప్రపంచం నలుమూలల నుండి లక్షలాదిమంది భక్తులు ఈ మహా కుంభమేళకు హాజరవుతారు. వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీ నా ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహా కుంభమేళా జాతరను ముగించనున్నారు. కాబట్టి దాదాపుగా 43 రోజులపాటుగా జరిగేటువంటి ఈ మహా కుంభమేళా జాతరకు చాలామంది భక్తులు ప్రపంచ దేశాల నుండి తరలి వస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అటువంటి ఈ కార్యక్రమాలు, ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులు ప్రారంభించారు.
కాంతి కాకుండా స్నానాలు తేదీలు కూడా అధికారులు వెల్లడించారు. మొదటిగా జనవరి 13వ తారీఖున పుష్య పూర్ణిమ కావడంతో మొదటి రోజే ఈ స్నానాల తేదీ అనేది ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే 14 జనవరి మకర సంక్రాంతి కావడం, 29 జనవరి మౌని అమావాస్య కావడం, ఫిబ్రవరి మూడో తారీకు వసంత పంచమి కావడం, ఫిబ్రవరి 4 అచల నవమి కావడం, అలాగే ఫిబ్రవరి 12వ తారీకు మాగ పూర్ణిమ కావడం, ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి కావడం ఇవి నదులలో స్నానం ఆచారాలు చేయడానికి మంచి రోజులుగా వేద పండితులు వెల్లడించారు.
కాబట్టి జనవరి అంటే సంక్రాంతికి మొదలుకొని శివరాత్రి వరకు ఈ మహా కుంభమేళా జాతరలు అనేవి ఘనంగా జరగనున్నాయి. కాబట్టి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ వేడుకకు హాజరయ్యా ఎటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఏర్పాటు చేసుకోండి.