Lord venkateswaraswami : కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా?... 

Lord venkateswaraswami : కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా?... 

Lord venkateswaraswami :  సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర చాలానే అప్పు తీసుకున్నట్లు మనకి పురాణాలు చెబుతున్నాయి. దీపావళి అమావాస్యకు ముందు కుబేరుడుని పూజించడం ఆనవాయితీగా వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక హిందూ సాంప్రదాయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడుని దేవుడులా పూజిస్తారు. సంపద ఏ రూపంలో ఉన్న కానీ వాటన్నిటికీ అధిపతి ఆయనే అని అందరికీ తెలుసు. కుబేరుడి దగ్గరే కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నాడని అలాగే వాటికి సాక్షాలు కూడా ఇప్పటికీ రాగి రేకుల మీద రాసి ఉన్నాయని అందరికీ చెప్తుంటారు. 

 త్రిమూర్తులులో విష్ణువు ఒకరని విషయం మనకు తెలుసు. విష్ణువును సృష్టి పాలకునిగా చూస్తారు. దేవదేవుడని కూడా అంటారు.అంతటి మహావిష్ణువు కుబేరుడు దగ్గర అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికీ కూడా చాలామందికి డౌట్ గానే ఉంటుంది. దానికి సమాధానం మనం ఒక కథ రూపంలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Also IPL 2025 auction: జాక్ పాట్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్... ఎవరు ఎంత పలికారో తెలిస్తే మైండ్ పోవాల్సిందే?

 అసలు కథ ఏంటి?

 సాక్షాత్తు కుబేరుని దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి  అప్పు ఎలా చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భృగు మహర్షి అనే మహా ముని త్రిమూర్తుల శక్తిని పరీక్షించాలని ఒకనాడు అనుకున్నాడు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ మరియు విష్ణు మరియు మహేశ్వరలు. భృగు మహర్షి ముందుగా బ్రహ్మమహేశ్వరులను పరీక్షించాడు. ఆ తర్వాత విష్ణువును కలవడానికి వైకుంఠనికి బయలుదేరి వెళ్లాడు. విష్ణు తీసుకుంటున్నట్టుగా కనిపించాడు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువుని బృగు  మహర్షివిష్ణువు చాతి పై కాలితో తంతాడు. దీనికి విష్ణువు కోపగించుకోకుండా ఆ మహర్షిని గౌరవంగా స్వాగతిస్తాడు. విష్ణువులు ఈ వినయం చూసి మహర్షికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన క్షమా మూర్తి విష్ణువే త్రిమూర్తుల్లో గొప్పవాడని తెలుసుకున్నాడు. 

Read Also  Maruti Suzuki Sales: ఆహా!.. ఏంటి ఈ అమ్మకాలు? మారుతి సుజుకి గ్రేట్ సేల్స్ ?

01 -12

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

అమ్మవారికి కోపం ఎందుకు వచ్చింది?

లక్ష్మీదేవి బృగు మహర్షి చేసిన ఈ పని చూసి చాలా కోప్పడింది. ఎల్లప్పుడు పేదరికంలోనే జీవించాలన్నట్లుగా శపించింది. ఆ శాపం ప్రకారం బృగ మహర్షి బ్రాహ్మణులను కలవలేక పోతాడు. దీనివల్ల ఆయన ఎలాంటి పూజల్లో కూడా పాల్గొనలేక పోతాడు. గతంలో మాదిరిగా సమాజంలో మర్యాదలు కూడా లభించట్లేదు. భృగు మహర్షి లక్ష్మీదేవిని క్షమించమని చాలా రకాలుగా వేడుకుంటాడు. కానీ ఒక బ్రాహ్మణుడు విష్ణుమూర్తిని పూజించినప్పుడే నీకు ఈ శాపం నుంచి విముక్తి అనేది లభిస్తుందని లక్ష్మీదేవి చెప్తుంది. 

Read Also Lost Your Phone: మీ ఫోన్ పోయిందా!... అయితే ఇలా చేయండి వెంటనే దొరుకుతుంది?

ఆ తర్వాత లక్ష్మీదేవి తన శాపం కారణంగా భృగు మహర్షి అనుభవిస్తున్న బాధలు చూసి కనికరించింది. ఆయన బాధ తీర్చాలని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటుంది. అందుకే ఆమె భూలోకంలో పద్మావతి అమ్మవారిగా జన్మించింది. అదే సమయంలో విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా జన్మించారు. భూలోకంలో పుట్టినటువంటి అమ్మవారు శ్రీనివాసుని పెళ్లి చేసుకుంది. అప్పుడు బ్రాహ్మణులు ఈ పెళ్లిలో పాల్గొని స్వామిని పూజించారు. అలా బ్రాహ్మణులు విష్ణుమూర్తి పూజించిన తర్వాత బృహ మహర్షి శాపం నుండి విముక్తి పొందుతాడు. 

Read Also Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?

 వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర నుండి ఎంత అప్పు తీసుకున్నాడు?

చాలామంది చాలా రకాలుగా కుబేరుడు దగ్గర వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నాడని అందరూ అంటూ ఉంటారు. అయితే పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి శ్రీనివాసులు పెళ్లి చేసుకోవడానికి కుబేరుని దగ్గర నుంచి ఒక కోటి 14 లక్షలు బంగారు నారాయణ మూర్తిగా తీసుకున్నాడు. శేషాద్రి కొండలు పై స్వర్గాన్ని సృష్టించమని దేవ శిల్పి విశ్వ కర్మను కోరుతాడు. కుబేరుని అప్పు తన భక్తుల సమర్పించే కానుకలతో తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ కూడా తీరుస్తుంటాడని హిందువులు అలాగే తిరుమల వెళ్లేటువంటి ప్రతి భక్తులు కూడా అంటూ ఉంటారు. 

01 -13

 అయితే ఈ అప్పు ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు అని అడిగినప్పుడు కలియుగం మంతమయ్యే లోపు తీరుస్తామని శ్రీనివాసుడు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి మాట ఇచ్చాడట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఇచ్చే దానధర్మాలు ద్వారా స్వామివారు ఈ మాటను నిలబెడుతున్నారని అందరూ కూడా అంటూ ఉంటారు. 

 అలాగే ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. స్వామి వారికి శనివారం నాడు అంటే ఎంతో ఇష్టమైన అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు. పెద్ద మొత్తంలో కానుకలు కూడా చెల్లిస్తూ ఉంటారు.

Tags:

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?