Famous Temples: మ‌న‌దేశంలో అత్య‌ధికంగా దేవాల‌యాలు కొన్ని రాష్ట్రాల‌లోనే ఉన్నాయి.. అవి ఎక్క‌డంటే..?

Famous Temples: మ‌న‌దేశంలో అత్య‌ధికంగా దేవాల‌యాలు కొన్ని రాష్ట్రాల‌లోనే ఉన్నాయి.. అవి ఎక్క‌డంటే..?


Famous Temples: మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని వేలల్లో దేవాలయాలు ఉన్నాయంటే ఇది కచ్చితంగా నిజమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాల్లో లేదా లాభాల లో దేవుడిని కొలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి మీద నమ్మకంతో పనులను ముందుకు ప్రారంభిస్తారు. 

కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందరిలోనూ కూడా ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయని సందేహం కూడా ఉండి ఉంటుంది. మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

 భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన మన భారతదేశంలో ఇస్లాం మరియు క్రైస్తవం అలాగే బౌద్ధ మతం లాంటి అనేక మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటన్నిటికి మించి హిందువులు మెజారిటీగా జీవిస్తున్న ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి భారతదేశంలో హిందూ మతం మరియు ప్రాచీన సాంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటిది. మరి మిగిలిన వారు  మనదేశంలో సామరస్యంగా జీవిస్తూ ఉన్నారు. 

Read Also God Curse: మొక్కులు తీరాక చెల్లించక‌పోతే దేవుడు నిజంగానే మిమ్మ‌ల్ని శపిస్తాడా?

2511
ప్రతి ఒక్కరు కూడా తమ తమ సంప్రదాయాలను ఆచారాలను గౌరవిస్తూ అలాగే పాటిస్తూ మన భారతదేశంలో మత సాంప్రస్యాన్ని కాపాడుతున్నారు. అందుకే భారతదేశంలో ఏకత్వంగా  మంచి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక్కో దేవుడికి కొన్ని వేలల్లో ఆలయాలు ఉన్నాయంటే మీరు కచ్చితంగా నమ్మాల్సిందే. 

Read Also karthika masam: ఆహా.. కార్తీక మాసంలో భక్తులతో  కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు 

 భారతదేశంలో ప్రస్తుతం అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. మరి ఈ రాష్ట్రం ఎందుకు ఆరో ప్లేసులో ఉందంటే ఏకంగా  47 వేల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి. మనందరికీ తెలిసిందే మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే శ్రీకాళహస్తి,  విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం,నెల్లూరు రంగనాథ దేవాలయం మొదలైనవి చాలానే ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. 

Read Also Hope: ఆశకు మించిన వ్యాధి మరొకటి లేదు అంటున్న దైవం?

 ఇక అత్యధిక దేవాలయాలు ఉన్న భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇక్కడ దాదాపుగా 79 వేల దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు హిందూ మతంతో సహా అన్ని మతాలకు నిలయంగా ఉంటుందని  మనం ఈ వార్తతో అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి కూడా తెలుసుకోవచ్చు. తంజావూరు పెరియకోయిల్ తో సహా ఇక్కడ దేవాలయాలు వేల సంవత్సరాలు నాటివి ఇక్కడ ఎన్నో దేవాలయాలనేవి ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రాష్ట్రం భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. 

Read Also Diwali festival: ఆనందాల పండుగ‌ దీపావ‌ళి..ఆరోజునే దీపాలు వెలిగించి, టపాసులు ఎందుకు పేల్చుతారో తెలుసా?

2512
 ఇక అత్యధిక జాబితాలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో దాదాపుగా 77 వేల దేవాలయాలు ఉన్నాయట. వాటిలో ముంబై దేవి ఆలయం, అష్ట వినాయక, మహాలక్ష్మి, శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం, భీమా శంకర్ జ్యోతిర్లింగం, శని సింగనాపూర్, గిరిజామాత, కైలాస దేవాలయం, అమృత్సర్ లాంటి దేవాలయాలు మహారాష్ట్రలో చాలానే ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర అత్యధిక దేవాలయాలు ఉన్న జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 

 అత్యధిక దేవాలయాలు ఉన్న మూడవ  స్థానంలో ఉంది కర్ణాటక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 61 వేల దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రసిద్ధి దేవాలయాలలో కొల్లూరు, ధర్మస్థల, శృంగేరి, కర్కలా, మురుడేశ్వర్, అలాంటి ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. 

 ఇక అత్యధిక దేవస్థానాలు ఉన్న నాలుగో  స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఇక్కడ మొత్తం దాదాపుగా 53,500 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కోల్కతా, బేలూరు మఠం హౌరా, ఇస్కాన్ టెంపుల్, నందికేశ్వర్ టెంపుల్, తారకనాథ్ టెంపుల్, డార్జిలింగ్ శాంతి పగోడా, పరాసనాధ్ టెంపుల్ మొదలగు ప్రాచీనమైన దేవాలయాలు చాలానే ఉన్నాయి. 

2514
 భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న ఐదవ రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఇక్కడ దాదాపుగా 50వేల దేవాలయాలు ఉన్నాయి . వీటిలో ఎన్నో ప్రేమకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా ద్వారకా థిస్ దేవాలయం, సోమనాథ్ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, భాగవత కొండ, అంబాజీ ఆలయం, అక్షరధామ్ ఆలయం, దేవరేశ్వరా మహాదేవ ఆలయం, రుక్మిణీదేవి, ద్వారక, శ్రీ స్వామి నారాయణ ఆలయం లాంటి ప్రసిద్ధమైన ఆలయాలు ఈ గుజరాత్ రాష్ట్రంలో కలవు. 

 కాబట్టి మన భారతదేశంలో ఇవే అయిదు అత్యధిక దేవాలయాలు గల రాష్ట్రాలుగా రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ అత్యధిక మోతాదులో హిందూ సాంప్రదాయాల దేవాలయాలు దాదాపుగా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాలలో ఉన్నాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?