Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.... భవిష్యత్తులో జరగబోయే ఇవే?

Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.... భవిష్యత్తులో జరగబోయే ఇవే?

Kalagnanam: శ్రీ పోతులూరి  వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ ఎన్నో జరిగినా విషయాలు మనందరికీ తెలిసిందే. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసుకున్న విషయాలలో సగం ఇప్పటికే జరిగిపోయాయి మరికొన్ని జరగాల్సి ఉన్నాయి. ఈ స్వామి చెప్పినట్లు గతంలో చాలానే జరిగాయి. అవన్నీ కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం.  అలాగే వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూసాము. జరిగినవి అన్ని చూస్తే కనుక భవిష్యత్తులో జరగబోయేవి కూడా కచ్చితంగా నిజమవుతాయని అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో జరగబోయేటువంటి మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు భవిష్యత్తులో జరగబోయేటువంటివన్నీ కూడా తన కాలజ్ఞానంలో రాసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తిరుపతికి వెళ్లే దారులు అన్నీ కూడా మూసుకుపోతాయని  కాలజ్ఞానంలో రాసి ఉండడంతో ఇది కచ్చితంగా జరగబోయేటువంటి విషయమేనని అర్థమవుతుంది. అంతేకాకుండా కృష్ణానది మధ్యలో బంగారు వ్రతం ఉంటుందని అది చూసిన వారి కళ్ళు పోతాయని చెప్పుకొచ్చారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఒక ఆరుగురు దొంగలు దోచుకుంటారని  ఆయన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. ఇక అంతేకాకుండా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడుతాడని కూడా వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ద్వారా వెల్లడించారు. 

Read Also Motor Insurance: మీ వాహనం ప్రమాదానికి గురయ్యాక ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? 

 ఇక యాగంటి బసవన్న కూడా రంకే వేస్తాడని  ఆ క్షణంలో చాలామంది దుర్మార్గులు మట్టి కొట్టుకుపోతారని కూడా రాసుకోచ్చారు.  బనగానపల్లెలో పాతరం మీద చింత చెట్టుకు బూజులు   పూస్తాయని అన్నారు. రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను చెబుతుందని అన్నారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇక మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళతాడని  అన్నారు. పెనుగొండలో పెద్ద పులులు భారీగా తిరుగుతాయని చెప్పుకొచ్చారు. నెల్లూరు సీమ నీటిలో మునిగి పోతుంది అని అన్నారు. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు పాటుగా మూసివేస్తారని అన్నారు. 

Read Also Yama Dharma Raja: జననం, మరణం గురించి  యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...

1422

Read Also Artificial Intelligence: భవిష్యత్తులో ఏఐ  ఎటువంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా ?

 ఇక అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని చెప్పుకొచ్చారు. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని, కంచి కామాక్షి కనులెర్ర చేస్తుందని  దీనివల్ల దక్షిణాన్ని జనాలు చాలామంది మరణిస్తారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. అంతేకాకుండా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ  ముక్కు పుట్టుక వరకు నీళ్లు చేరుతాయని  దీనివల్ల మొత్తం వినాశనం జరుగుతుందని కూడా కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. దీంతో కచ్చితంగా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లు జరుగుతుందని ఎప్పుడు ఏ వినాశనం పుట్టుకొస్తుంది అని ప్రజలు కూడా చాలా మంది భయపడుతున్నారు.

Read Also teeth turning yellow :  పళ్ళు పసుపు గా మారుతున్నాయా?.. అయితే ఇలా చేయండి.. చిటికెలో మాయం ?

 అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా సంవత్సరానికి రెండు మూడో జరుగుతున్నడంతో ఇవి జరిగేసరికి మనం మూడు తరాలు కూడా అయిపోతాయని  అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినటువంటి అన్ని మాటలు కూడా నిజమయ్యాయి. ఇక జరగబోయే ఈ తన కాలజ్ఞానంలో విన్నప్పుడల్లా ఇది కూడా జరుగు తీరుతాయని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా సరే కాలజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా జరిగి తీరుతుందని పండితులు చెప్తున్నారు. ఈ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినటువంటి  ఏ ఒక్క విషయాన్ని కూడా మనం మార్చలేమని అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

Read Also సలార్-2లో డేంజర్ విలన్?... ఏ దేశం వాడో తెలుసా ?

Tags:

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?