పారదర్శకంగా కనిపించే కొత్త డిస్ప్లే లు.... ఎలా ఉంచినా లేదా మడత పెట్టిన పగలవు?
ప్రస్తుతం కాలంతో పరుగులు పెడుతున్న టెక్నాలజీ కూడా అతి వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికి ఈ స్క్రీన్ మరియు డిస్ప్లే లో కొత్త కొత్త టెక్నాలజీ లను ఉపయోగించి తయారుచేస్తున్న అవి పగిలిపోతాయానే భయం అందరిలోనూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ కొత్త టెక్నాలజీ తో రబ్బరు డిస్ప్లే గ్లాసులతో తయారుచేస్తున్నారు. కాబట్టి ఎల్ జి అలాంటి భయం లేకుండా కొత్త టెక్నాలజీ తో డిస్ప్లే గ్లాస్ లు పగిలిపోకుండా తయారు చేస్తున్నారు.
ఈ 2024 లో ఎన్నో కొత్త డిస్ప్లే లు రాగ అవన్నీ కూడా ఎక్కడో ఒకచోట పగిలిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తాజాగా కొత్త ఆవిష్కరణ తో పగిలిపోకుండా సాగేలా ఉండేలా గ్లాసులను తయారుచేస్తున్నారు. ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ ఈ కొత్త డిస్ప్లే ప్యానల్ ను విడుదల చేసింది. ఇక ఈ డిస్ప్లే అనేది ఏకంగా 50% వరకు సాగుతుందని ఎల్జి కంపెనీ వివరించింది. ఇక ఈ డిస్ప్లేని ఎలా అయినా మడత పెట్టవచ్చు లేదా ఉంచవచ్చు. సాగదీసినా కూడా ఈ డిస్ప్లే కి ఏమి కాదు. కాబట్టి ఈ డిస్ప్లే వాడకం అనేది చాలా విస్తృతమైనది. శరీరానికి తగ్గట్టుగా దుస్తుల్లో కూడా దీనిని అమర్చవచ్చు. అంతేకాకుండా వీటిని వాహనాల్లో కూడా వాడవచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్లే చాలా తేలికైనది అలాగే ఎక్కువ బరువు కూడా ఉండదు కాబట్టి.
ఇక మైక్రో ఎల్ఈడి లైట్ టెక్నాలజీని ఈ ఎల్ జి వాడుతోంది. కాబట్టి 40 మైక్రో మీటర్ల పరిణామములు ఉండే ఈ డిస్ప్లే పదివేల సార్లు సాగదీసిన ఏమి కాకపోవడంతో పాటు తక్కువ మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. ఇక ఇది స్క్రీన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ది మంచి మార్గదర్శక ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అందరూ అంటున్నారు.