Android Phone: మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ మీకు తెలుసా?... ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే?
అయితే కొన్ని కంపెనీ ఫోన్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి. కానీ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ కి సాధారణంగా ఉండేటటువంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ ఫీచర్లను కచ్చితంగా తెలుసుకోండి. మనం కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో కొంచెం బిజీ వర్క్ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఫోన్ ఉపయోగించడం చాలా డేంజర్. ఇప్పుడు మనం ఎవా ఫేషియల్ మౌస్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్ సహాయంతో మీరు తల కదలికల ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను కంట్రోల్ చేయవచ్చు.
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంటర్నెట్ వాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉంచేందుకు ఫోన్ హోం స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ను బ్లాక్ లోకి మార్చుకోండి. అప్పుడు రంగురంగుల చిత్రాలు లేదా వీడియో స్క్రీన్ సేవలను ఉంచవద్దు. కాబట్టి ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది.
ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ పోతే అది ఎక్కడుందో మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి భద్రత ఎంపికలను క్లిక్ చేయండి. అక్కడ డివైస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆప్షన్ సెట్టర్ ఆప్షన్ లో ఎడమవైపు ఉన్న బాక్స్ పై క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ ద్వారా మీ పోగొట్టుకున్న ఫోన్ లొకేషన్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన ఫోన్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా లాక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా మీరు ఎవరికైనా మీ ఫోన్ ఇస్తున్నప్పుడు మీ ముఖ్యమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవచ్చు. ముందుగా క్రోమ్ లోకి వెళ్లి డెస్క్ టాప్ మోడ్ ను ఆన్ చేయాలి. తర్వాత యూజర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అతిథి చిహ్నం అనేది కనిపిస్తుంది. ఒకసారి మీరు ఏ సమాచారాన్ని చూపించాలనుకుంటున్నారో మీరు ఏ సమాచారాన్ని దాచాలి అనుకుంటున్నారో అనే ఆప్షన్లు వస్తాయి. వీటిని ఇక మీరే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.