Car Rental: మీ కారు అద్దెకు ఇస్తున్నారా?... డబ్బు కోసం ఆశపడితె అంతే సంగతి!
ఇటీవల కాలంలో ఖరీదైన కారులను అద్దెకు తీసుకొని లేదా ఇతర ప్రాంతాల్లో అద్దెకు తిప్పడం లాంటి పేరిట చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఓ యువకుడు ఇలాగే తమ కారును అద్దెకి ఇచ్చి తిరిగి విడిపించుకోలేక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వాళ్ల దగ్గరే చావు దెబ్బలు కూడా తిన్నాడు. వైసీపీ ఎంపీ బంధువులమంటూ నిందితులు ముఠా కారుల యజమానిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశారట. ఇక చివరికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో కర్ణాటకలో తిరుగుతున్న కార్లను విడిపించుకుని బాధితులకి అప్పగించారు.
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి ముఠాలు చాలానే ఉన్నాయని బయటకు వచ్చింది. సంతకారులే కదా అని అద్దెకి ఇస్తే వాటిని అధిక తీసుకొని చాలామంది టోకరా వేస్తున్న సంఘటనలు ఈమధ్య చాలా వెలుగు చూస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాదులో ఒక మహిళ ఏకంగా రెండున్నర కోట్లు విలువ చేసే 21 కారులను మాయం చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని బయటకు వెల్లడించారు.
కాబట్టి కార్లను అద్దెకివ్వడం వల్ల మనకి 2000 నుంచి 3000 వరకు ఆదాయం వచ్చినా కూడా కారు 450 కిలోమీటర్లు వరకు తిప్పడంతో కారు జీవితకాలం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒకటి లేదా రెండు రోజుల్లో ఏకంగా కొన్ని వేలకు కిలోమీటర్లు కనుక దూరం ప్రయాణిస్తే ఇంజన్ సామర్థ్యం వేగంగా తగ్గిపోతుందని అలాగే వారంటీలు కూడా త్వరగా పూర్తవుతాయని కొంతమంది చెప్తున్నారు. ఇక వారిచ్చే అద్దెతో పోలిస్తే కారు రిపేర్లకు అయ్యే ఖర్చు డబల్ ఉంటుంది. కాబట్టి మనం కొనుగోలు చేసింది కొద్ది రోజులైనా కూడా కచ్చితంగా కారును గ్యారేజ్ కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి కారును అధిక ఇవ్వడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని వాహన గ్యారేజ్ నిపుణులు చెబుతున్నారు.