Maruti Suzuki Sales: ఆహా!.. ఏంటి ఈ అమ్మకాలు? మారుతి సుజుకి గ్రేట్ సేల్స్ ?
డిసెంబర్ 1వ తారీకున ఈ వివరాలను విడుదల చేయడం జరిగింది. ఎక్కువగా మన భారతదేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి ఏకంగా లక్ష్య 81 వేల వాహనాలను విక్రయించిందట. కాబట్టి దీంతో ఈ వార్షిక ప్రతిపాదికన 10.4% ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఈ కారుని అతి తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ ఉన్న కారుగా భావించి కొనుగోలు చేయడం చేశారు. ఇక మరోవైపు 2024 నవంబర్లో వార్షిక ప్రతిపాదికన టాటా మోటార్ అమ్మకాలు అనేవి 0.8% స్వల్పంగా పెరిగాయి. కాబట్టి దీంతో పోల్చుకుంటే మారుతి సుజుకి ఏకంగా 10% ఈక్కువే అని చెప్పాలి.
కాబట్టి అంతర్జాతీయంగా ఈ కార్లకు బలమైన డిమాండ్ కారణంగా కంపెనీ ఎగుమతులు అనేవి కూడా పెరిగిపోతున్నాయి. ఇక మారుతి సుజుకి మొత్తం నవంబర్ 2024లో వన్ పాయింట్ ఎయిట్ వన్ లక్షల వాహనాలను అమ్మకాలు చేసింది. మొదటగా సిఎన్బిసి - టీవీ18 అంచనా వేసిన 1.77 లక్షల యూనిట్ల కన్నా ఇది చాలా ఎక్కువ. ఇక అదే సమయంలో నవంబర్ 2023లో 1.64 లక్షలు యూనిట్ల కన్నా 10.4% చాలా ఎక్కువ.
ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే 74,753 యూనిట్ల మొత్తం అమ్మకాలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఇక ఏడాది కాలంలో 0.శాతంతో స్వల్ప పెరుగుదలైనది. దేశీయ విక్రియలు కూడా కేవలం ఒక శాతం అభివృద్ధితో 73246 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే మరోవైపు వాణిజ వాహనాల విభాగం ఒక శాతం క్షీణించి 26 వేల 183 యూనిట్లకు చేరుకుంది. కాబట్టి 10% మారుతి సుజుకి కార్లే ఎక్కువగా కొద్ది నెలల్లో అమ్మకాలు జరిగాయి. కాబట్టి ఏకంగా 10 శాతం మారుతి సుజుకి కార్లు అమ్ముడవడంతో భారీగానే ఆదాయం తో పాటు కొనుగోలు చేసేటువంటి మనుషులు కూడా పెరిగిపోయారు. దీంతో ఈ మారుతి సుజుకి కంపెనీకి భారీగానే లాభాలు చేకూరాయి.