Human Washing Machine: బట్టలనే కాదు మనుషులను కూడా వాష్ చేసే కొత్త మిషన్?
ఇక తాజాగా జపాన్ కు చెందిన సైన్స్ కో కంపెనీ ఇంజనీర్లు ఈ మిషన్ ను తయారు చేసినట్టు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఇక ఇప్పటికే ఈ మిషన్ ను ఒసాక కాన్సయ్ ఎక్స్ పోలో దాదాపు వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగాయట. త్వరలోనే దీనికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ వర్షన్ విడుదల చేస్తామని సైన్స్ కో కంపెనీ చైర్మన్ ఆయోమా వెల్లడించారు.
మనుషుల అవసరాలను అలాగే భవిష్యత్తులో మనుషులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనుషులను దృష్టిలో పెట్టుకొని వీటిని తయారు చేశామని జపాన్ ఇంజనీర్లు తెలిపారు. ఇక ఈ మిషన్ డిజైన్ అయితే ఏకంగా 50 ఏళ్ల క్రితం నాటిదని తెలిపారు. ఇక 1970లో జపాన్ వరల్డ్ శాన్యూ ఎలక్ట్రిక్ కో దీన్ని మొదటిసారి తయారు చేశారట. ఇక దాంతో పోలిస్తే ఇప్పుడు చేసినటువంటి కొత్త వర్షన్ మిషన్ అనేది అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చి తయారు చేసినట్లుగా వీళ్ళు తెలిపారు.
కాబట్టి బట్టలు ఉతికి ఆరేసినట్లుగా మనుషులు కూడా చక్కగా ఎటువంటి శక్తిని సమర్పించకుండానే స్నానం చేసి తక్కువ సమయంలోనే బయటికి వెళ్ళవచ్చు అని ఇలాంటి ఈ టెక్నాలజీని తీసుకు వచ్చినందుకు శాస్త్రవేత్తలు కూడా చాలా మంది థాంక్స్ చెబుతున్నారు. మరికొందరు ఈ స్నానం చేయడానికి మిషన్ ఏంటని భవిష్యత్తులో మనుషులందరూ కూడా బద్దకస్తులు అవుతారని చాలామంది ఈ మిషన్ పై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.