Elon Musk: ఇండియా మొత్తం వైఫై... అదిరిపోయే న్యూస్ చెప్పిన ఎలా ఎలాన్ మస్క్?
ఇక ఈ కంపెనీ కొనుక్కో మన ఇండియాలోకి వస్తే ఇకపై మనం కరెంటు స్తంభాలు అలాగే ఇంటర్నెట్ టవర్లు అలాంటివి మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కంపెనీ అనేది ఇలాంటివన్నీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా సాటిలైట్ ద్వారా దేశానికే ఫ్రీ వైఫై అందించేలా ఈ కంపెనీ కొత్త టెక్నాలజీ ద్వారా రూపొందిస్తుంది. దేశంలోని ఏ మూల ప్రాంతానికి వెళ్లిన సరే లేదా కొండలపై మరియు నడి సముద్రాలపైన అయినా సరే మనకి ఇంటర్నెట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు స్టార్ లింక్ కంపెనీ ద్వారా చేస్తున్నాడు ఎలాన్ మస్క్.
ప్రస్తుతం చాలా చోట్ల కూడా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ దేశం ఇంటర్నెట్ లేక చాలా అవస్థలు పడింది. ఆ సమయంలోనే ఎలాన్ మస్క్ ముందుకు వచ్చి యుద్ధ సమయంలో ఇంటర్నెట్ అందించడం ద్వారా కొంచెం సులభం అయింది. యుద్ధ సమయంలో ముఖ్యముగా సైన్యానికి ఇంటర్నెట్ను కల్పించి ఎల్లెన్ మాస్క్ ఆదుకున్నాడు. ఈ ఎలాన్ మాస్క్ ఇప్పటికే చాలా దేశాల్లో కూడా స్టార్ లింక్ కంపెనీ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాడు. ఈ వ్యాపారం చేస్తూ అతను చాలానే డబ్బులు కూడా కూడగడుతున్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కు సంబంధించినటువంటి 100 స్టార్ లింక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నాడు.
ఈ స్టార్ లింక్ వెబ్సైట్లో కూడా త్వరలోనే ఇండియాలో కూడా ఈ సర్వీసులు ప్రారంభిస్తామని ఎలాన్ మస్కు సంబంధించినటువంటి అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ కంపెనీ వస్తే మాత్రం కచ్చితంగా ఎటువంటి పోల్స్ అలాగే కరెంటు అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఓ చిన్న రిసీవర్ డిస్లాంటిది మనకి ఇస్తారు. ప్రస్తుతం అది మనం పెట్టుకునేటువంటి వైఫై రూటర్ అంత ఉంటుంది.
ఇక దీన్నే స్టార్ లింక్ ఇంటర్నెట్ కిట్ అని అంటారు. ఈ చిన్న డిష్ ని ఇంటిపై పెట్టుకుంటే అది డైరెక్టుగా స్టార్ లింక్ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఎలాన్ మస్కికి స్పేస్ ఎక్స్ అని కంపెనీ ఉండడంతో ఈ పని కూడా చాలా సులభతరంగా చేయగలుగుతున్నాడు. భవిష్యత్తులో ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడుతుందని అందరు అనుకుంటున్నారు.