మహిళల విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి

బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు

మహిళల విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని  కృషి

బోడుప్పల్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి ఉత్సవాలు
బోడుప్పల్, క్విక్ టుడే న్యూస్:  మహిళల విద్య కోసం మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు, శుక్రవారం బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి సమాజంలో మహిళలకు విద్యా అవకాశాలు లేవని, సతీసహగమనం ఆచరణలో ఉండేదని వీటి నిర్మూలనలకు జ్యోతిరావు పూలే నడుం బిగించారని కొనియాడారు.
 
ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన కృషి వల్లే నేడు మహిళలకు విద్యా అవకాశాలు దక్కాయని అన్నారు. అలాంటి మహనీయుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సువర్ణ మాట్లాడుతూ.. మహిళల కోసం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి మహిళల కోసం కృషి చేశారని, అదే స్ఫూర్తితో నేడు మహిళలకు కుట్టు మిషన్l లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను ప్రదానం చేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.
 
1101
 
ఈ సందర్భంగా రాపోలు సువర్ణ రాములు దంపతులను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు అబ్రహాం లింకన్, జనరల్ సెక్రటరీ యాదగిరి, వెంకట్రావ్, చిత్తరంజన్, రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చింతల నిర్మల రెడ్డి, మాజీ వార్డు సభ్యురాలు మంగమ్మ, డాక్టర్ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?