జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలె విగ్రహ ఆవిష్కరణ

జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలె విగ్రహ ఆవిష్కరణ

తొర్రూరు,ఏప్రిల్ 11:- మండలంలోని హరిపిరాల గ్రామం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జాతీయ మానవ హక్కుల మండలి స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో జ్యోతిరావు,సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాల కమిటీ అధ్యక్షులు తలారి అశోక్ అధ్యక్షతన పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో తలారి మధువన్ మాట్లాడుతూ..జ్యోతిరావు పూలే తన జీవితాంతం సామూహిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ శక్తులను విశ్లేషించడంలో అవిశ్రాంతగా కృషిచేసి పోరాటం చేశారని అన్నారు. శ్రీ పురుష సమానత్వం కోసం కృషి చేశాడని అన్నారు.అంతేకాకుండా మానవ హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,సమాజంలోని చెడును ప్రారదోలి మంచిది ప్రేరేపించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ముందుంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల మండలి స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నక్క గంగారాం, వీరమల్ల సందీప్, నాగరాజ్ చౌహాన్,తాళ్లపల్లి మల్లేష్, మెరుగు సందీప్ కుమార్,తండాల రాజు,జుమ్మడి జనార్ధన్, తలారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250411-WA0045

Read Also శుక్రవారం డయల్ యువర్ డిఎం... తొర్రూర్ డిపో మేనేజర్ వి పద్మావతి!

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?