Konda Surekha: సంచలనం సృష్టిస్తున్న కొండా సురేఖ వ్యాఖ్యలు.... యావత్ టాలీవుడ్ మొత్తం ఏకమైన వేళ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ సమంత,నాగచైతన్య విడాకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్ళ యొక్క విడాకులకు కారణం కేటీఆర్ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలెట్గా నిలిచింది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసిన సరే ఈమె మాట్లాడిన మాటలే అందరికీ కనపడుతూ వినిపిస్తున్నాయి.
సమంత నాగచైతన్య గత రెండు సంవత్సరాలు క్రితం విడాకులు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందె. అయితే దానికి కారణం మనకి మాత్రం ఏ మాత్రం తెలియదు. కానీ వాళ్ళు విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు అవుతున్న సరే ఇప్పుడు ఆ విడాకుల విషయాన్ని కేటీఆర్ వల్లే విడిపోయారంటూ కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలన్నీ విన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు అలాగే నాగచైతన్యకు అలాగే అక్కినేని ఫ్యామిలీకి ఎంతగానో పేరు ఉంది. వాళ్లు విడిపోయినా సరే వాళ్ళ యొక్క రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ బయటికి లాగారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యల పైన ఎంతోమంది ఆమెపై విరుచుకుపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత కేటీఆర్ కొండా సురేఖ కి డెడ్లైన్ అనేది పెట్టారు. కేటీఆర్ అయితే కొండా సురేఖ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు బహిరంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కొండా సురేఖకి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా విఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా కొండా సురేఖ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు సరైనవి కావు కచ్చితంగా దీనిని ఖండిస్తున్నామని తీవ్రంగా సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈమె మాటలు విన్న సమంత అలాగే అక్కినేని కుటుంబం కూడా ఖండించారు. సమంత అయితే ఏకంగా నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. మేం విడిపోవడానికి కారణం కేటీఆర్ కాదు. నన్ను ఎందుకు మీరు రాజకీయాల్లోకి లాగుతున్నారు. నేను విడాకులు తీసుకున్న తర్వాత సంతోషంగానే ఉన్నాను. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగవద్దు అని కొండా సురేఖకి వార్నింగ్ ఇచ్చింది సమంత. అయితే తర్వాత అక్కినేని కుటుంబం కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ప్రశాంతంగా జీవిస్తున్న మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి లాగొద్దు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ కూడా పోలీసులు కంప్లీట్ చేశారు. అయితే ఇంతటితో మాత్రం టాలీవుడ్ ఆగిపోలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఈరోజు ఇంతటి స్థాయికి ఎదిగిన వాళ్ళని ఇలా రాజకీయాల్లోకి లాగి వాళ్ల భవిష్యత్తును నాశనం చేయవద్దు అని టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక ద్వారా తెలుపుతున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే చాలామంది హీరోలు స్పందించారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్, నాని, అల్లు అర్జున్ ఇంకా చాలామంది సోషల్ మీడియా వేడుక ద్వారా స్పందిస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజకీయంతో ఎటువంటి సంబంధంలేని వాళ్లని మా సినిమా ఇండస్ట్రీ వాళ్లని ఎందుకు లాగుతున్నారు.
అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం అసలు సహించబోమని చెప్పారు. ఇలానే నిరాధార ఆరోపణలు చేస్తూ చిత్ర పరిశ్రమపై మాటలు యుద్ధం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ విషయంపై చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి మీపై నిరసనకు దిగుతామని కచ్చితంగా మీరు అందరి ముందు బహిష్కలంగా క్షమాపణలు చెప్పాలని అందరూ అన్నారు.
అయితే ఈ విషయంపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది చర్చించుకుంటున్న విషయమే. అయితే ఇప్పటికీ కూడా సమంత ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయిలో నిలబడిందంటే దాని కారణం తన పట్టుదల,కృషి ఏ కారణమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇలాంటి నిరాహార ఆరోపణలు చేసి నిజాయితీ గల మనుషులను మీరు లొంగ తీసుకోలేరు అని సినీ హీరోలు ఒకరికొకరుగా అక్కినేని కుటుంబానికి అలాగే సమంత కుటుంబానికి అండగా నిలబడుతూ వస్తున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాఖ్యలు అనేవి అందరూ కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఇలాంటి అసత్యాలను మాట్లాడుతూ ఏ మాత్రం సినీ ఇండస్ట్రీపై గౌరవం లేకుండా ఎలా మాట్లాడగలుగుతారు అని అల్లు అర్జున్ తో పాటు విక్టరీ వెంకటేష్ అలాగే ఎన్టీఆర్ మరియు నాని కూడా కొండా సురేఖ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే దసరా మూవీ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ అయితే ఏకంగా నేను సమంతని రంగస్థలం మూవీ షూటింగ్ జరుగుతున్నప్పటినుంచి తనని చూస్తున్నాను .
తను ఎంతో మంచిది తను ఎప్పుడూ కూడా అలాగా రాజకీయాల గురించి గానీ ఎప్పుడైనా సరే ఏమీ మాట్లాడలేదు. తనపై మీరు ఎందుకు అలా చెప్తున్నారు అది తన వ్యక్తిగత విషయం. రాజకీయంలోకి ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమని తీసుకురాకండి అని చాలామంది కొండా సురేఖ పై తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అన్ని సోషల్ మీడియాలలో ఇదే హార్ట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఇన్ని జరుగుతున్న కూడా ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే కొండా సురేఖ పై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది తప్పకుండా వేచి ఉండాల్సిందే.