Narayan Meghaji Lokhande: ఆదివారం రోజే ఎందుకు సెలవు?.. మన దేశంలో ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది..
కానీ ఇది ఎవరు చేశారు?.. అలాగే ఎప్పటినుంచి ఈ ఆదివారం అనేది సెలవు దినముగా ప్రకటించి ఉంది. అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మనిషి కూడా వారం రోజులు పాటు పనిచేసి ఆదివారం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేవాళ్లే. అయితే ఇప్పుడున్న కాలంలో అయితే పిల్లలు కూడా స్కూలుకు వెళ్లడానికి బద్ధకంగా మరీ ఆదివారం రోజున సెలవు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు.
సోమవారం నుంచే మళ్లీ ఆదివారం సెలవు గురించి ఆలోచిస్తుంటారు. అలాగే వచ్చిన రోజు చాలా సంతోషంగా ఉంటూ గడుపుతున్నారు. ఇప్పుడున్న కాలంలో పనిచేసే వ్యక్తి ఆదివారం కోసం విశ్రాంతి తీసుకోవడానికి వేచి చూస్తున్నాడు. సరదాగా కుటుంబంతో సహా ఏదో ఒక ప్రాంతానికో లేదా బంధువుల ఇంటికో వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అలాగే దాదాపు అన్ని ఫంక్షన్లు కూడా ఆదివారం ఉండేలా ఏర్పాట్లు కొనసాగిస్తుంటారు.
అయితే పూర్వకాలంలో సెలవు అనేది ఉండేవి కావు. పూర్వం మనదేశంలో వ్యవసాయం చేసే వారు ఎక్కువ ఉండడం వల్ల బ్రిటిష్ వారు మనల్ని పనులు చేయించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. దాంతో ప్రతిరోజు పనిచేయాల్సి వచ్చింది మన భారతీయులు. అయితే ప్రతిరోజు ఎంతోకొంత ధనం ఇవ్వడం వల్ల బ్రిటిష్ వారి దగ్గర వరుసగా కూలీలుగా జాయిన్ అయ్యారు మన భారతీయ మనుషులు. దాంతో ఎడతెరిపి లేకుండా ఇక ప్రతిరోజు కూడా పనులను చేసుకుంటూ జీవనం అనేది సాగించారు.
అయితే ఒక రోజు సెలవు కోసం ఉద్యమం జరిగింది. అయితే ఇది ఫస్ట్ యూరప్ లో ప్రస్తావించగా అప్పటి రాజులు ఒకరోజు సెలవు దినాన్ని ప్రకటించారు. దాంతో ఇక యూరోప్ దేశాలలో వారంలో ఒకరోజు సెలవు అనేది ఆనవాయితీగా మారిపోయింది . క్రమంగా అది అన్ని దేశాలకు పాకుతూ వచ్చింది.
అయితే మన భారతదేశంలో కూడా బ్రిటిష్ కాలంలోనే ఎన్నో గొడవలు జరిగాయి. విపరీతంగా ప్రజలు పనులు చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అయితే మన భారతదేశంలో కూడా వరుసగా కొన్ని ఉద్యమాలు అనేవి జరిగాయి. ప్రజలందరూ కూడా వారం రోజులపాటు పనిచేయాల్సి వస్తుందని దీనిపై అప్పట్లో కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే మన భారతదేశానికి అలాంటి రోజు ఒకటి వచ్చింది.
అయితే మన భారతదేశంలో ఈ ఆదివారం సెలవు దినం అనే ఒక సందేశం అనేది 1890లో జూన్ 10వ తారీకు వచ్చింది. ముఖ్యంగా మన దేశాన్నిలో ఆదివారం సెలవు దినంగా జరుపుకోవడానికి కారణం మహారాష్ట్ర కార్మిక సంఘానికి చెందిన నాయకుడు నారాయణ మేఘాజి లోకండే. ఇతను వల్లే మనం ప్రస్తుతం ఆదివారం సెలవు దినంగా విశ్రాంతి తీసుకుంటున్నాం. అప్పటి కాలంలో బ్రిటిష్ వారు మనకు ఏడు రోజులు పని దినంగా నిర్ణయించారు.
కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఆదివారం సెలవు తీసుకునేవారు. అయితే అప్పట్లో మన కార్మికులకు పని ఎక్కువైపోవడంతో బ్రిటిష్ వాళ్ళను వేడుకున్నారు. అయినా కూడా కనికరించకపోవడంతో మనవాళ్లు ఉద్యమాలు పెద్ద ఎత్తున చేశారు. దాదాపుగా ఒక ఏడు సంవత్సరాలు పాటు ఉద్యమాలు అనేవి చేశారు. ఇంకా తర్వాత చేసేదేం లేక చివరిగా జూన్ 10వ తారీకు 1890లో సెలవు దినంగా ప్రకటించారు.
ఇక అప్పటినుండి ఇండియా లో ఆదివారం సెలవు దినంగా జరుపుకుంటు అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి అప్పటి తరాలు నుండి ఇప్పటి తరాలు వారు కూడా.... ఈ ఆదివారం సెలవు దినంగా జరుపుకుంటున్నారు.