సన్న బియ్యం పథకంలో అర్హులైన వారి అందరికీ (రేషన్ కార్డుదారులకు) పంపిణీ చేయాలి...
గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,తో కలిసి జిల్లాలో ఆకస్మిక పర్యటనలు చేశారు.నెల్లికుదురు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న *రాజీవ్ యువ వికాసం పథకం* దరఖాస్తు దారుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
దరఖాస్తుదారులకు కావలసిన అన్ని ఏర్పాట్లను సేవా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకంలో వర్తించే అన్ని వివరాలు తెలియజేయాలని సూచించారు.
నెల్లికుదురు మండలం రేషన్ దుకాణం నెంబర్ 01, ను తనిఖీ చేసి డీలర్ మద్ది బుజ్జమ్మ తో మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన రేషన్ కార్డు దారులందరికి అందించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు ఎండాకాలం నేపథ్యంలో తగిన ఏర్పాట్లను రైతులకు కల్పించాలని సూచించారు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రస్తుత ఎండాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్స్ పరిధిలలో ముందస్తు వైద్య క్యాంపులు నిర్వహించాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యపరంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన జిల్లా కలెక్టర్*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మహబూబాబాద్ మండలం, జరుపులతండ గ్రామ పంచాయతీ, పరిధిలోని చీకటి చింతల తండలోనీ సన్న బియ్యం లబ్ధిదారులైన బానోతు గోవింద్ గృహంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్, స్థానిక తహసిల్దార్ భగవాన్ రెడ్డి, తదితర అధికారులు,
ఈ సందర్భంగా కలెక్టర్ గోవిందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారుడు బానోత్ గోవిందు మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కుటుంబం కడుపునిండా భోజనం చేయడం జరుగుతుందని, ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, నెల్లికుదురు తాసిల్దార్ రాజు,మహబూబాబాద్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో రఘుపతి రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.