Women Protection: పనిచేస్తున్న ప్రాంతాలలో మహిళలకు భద్రత ఉందా..? మంత్రి సీతక్క ఏమన్నారంటే..
ప్రస్తుతం మహిళలు ఇప్పుడిప్పుడే సొసైటీలోకి వచ్చి చక్కగా పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే మహిళలు పనిచేసే చోట భద్రత కల్పించాలని మంత్రి సీతక్క ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. అయితే మహిళలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఎవరికి తలవంచ వద్దని చెప్పారు. మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూస్తే దానికి బాధపడకుండా ముందుకు సాగాలని కోరారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు హత్యకు గురయ్యారు. కానీ కొన్ని కేసులను పోలీసులు ఇప్పటివరకు తేల్చలేకపోయారు.
ఇలాంటి సందర్భంలోనే మహిళలు చాలా భద్రతగా ఉండాలని అలాగే దాంతో పాటుగా ధైర్యంగా కూడా ఉండాలని మంత్రి సీతక్క విన్నపం చేశారు. మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షికోత్సవ సందర్భంగా లీడర్షిప్ సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ మహిళలు ఈ సమాజం యొక్క సృష్టికర్తలు. కానీ ఇలాంటి మహిళలపై ఎంతోమందికి చిన్న చూపు కలిగి ఉంది. కాబట్టి మహిళలు ఇంకా వెనక పడిపోతున్నారు.
ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న అలాగే ఎన్నో రకాలుగా ఎన్నో రంగాలలో రాణిస్తున్న సరే పురుషులే గొప్ప అన్న భావన ఇంకా అందరిలోనూ ఉంది. కాబట్టి మీరందరూ తక్కువ అనే భావం నుండి బయటకు రావాలి అని సందేశాన్ని మహిళలకు ఇచ్చారు. నేను కూడా ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలును పడ్డాను. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన దాన్ని. ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రిగా మీకు సేవలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఆదివాసి మహిళనైన నేను ఇప్పుడు ఒక పెద్ద పంచాయతీ శాఖ మంత్రిగా నన్ను ఈ ప్రభుత్వం నియమించింది. కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు వెళుతున్నాను. 13వేల గ్రామ పంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలుకు సేవ చేసే భాగ్యం ఇప్పుడు నాకు దక్కింది. కాబట్టి నేను ఆరోజు భయపడి ఉంటే ఇవ్వాలని ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు . కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా తనకు నచ్చిన రంగాల్లో ముందుండాలని కోరారు.
మహిళలు ఎక్కువగా పనులు చేస్తుండడం వల్ల ఆ ప్రాంతాల్లో ఎక్కువగా భద్రత కలిగించాలని సీతక్క కోరారు. మహిళలు సాటి మహిళగా ఎప్పుడు ఆలోచిస్తూ ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే దాన్ని ప్రశ్నించాల్సిందిగా కోరారు. మీరు ఎప్పుడైతే మౌనంగా ఉంటారు ఇక జీవితాంతం మొత్తం మౌనంగానే ఉండవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళా కూడా ప్రస్తుత పరిస్తుతులలో వెనక అడుగు వేస్తే ఇక లైఫ్ లాంగ్ వెనకాపడాలిసి వస్తుంది. కాబట్టి ఎవరికీ నచ్చిన రంగం లో వాళ్ళు దూసుకువెళ్ళండి అని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తున్నారు. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకూడదు. సవాళ్లను చాలెంజ్‌గా తీసుకొని మహిళలు నిలదొక్కుకోవాలి. మహిళా భద్రత, సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. వ్యాపారవెత్తలు ఎప్పుడు పట్టణం వైపే మొగ్గుచూపుకుండా పల్లెల్లో కూడా ఏదో ఒక రకంగా పరిశ్రమలు అలాంటివి తీసుకోచ్చి మహిళలకు ఉపాధి కలిపించాలని కోరారు.
గ్రామాల లోని చాలా మంది మహిళలు పట్టణాలకు వచ్చి ఇబ్బందిపడుతున్నారు. అలాంటివాళ్ళకి మరింత భద్రత కలిపించాల్సిన అవసరం చాలానే ఉంది. ప్రస్తుత కాలం లో ఆడవారు అంటే మరింత చులకనగా చూస్తున్నారు. కానీ మీరే ఇపుడు అన్నింట్లోను సమానంగా ఉన్నారని ధైర్యాన్ని మహిళల్లో నింపారు సీతక్క. అన్ని కంపెనీల లోనూ మహిళలకు అవకాశాలు ఇవ్వాలి అప్పుడే మన రాష్ట్రము అలాగే దేశం కూడా ఇలాంటి లింగ వివక్షత లేకుండా సంతోషంగా ఉంటారు. ఆడ మరియు మగ అనే తేడా లేకుంటే హత్యలు కూడా చాలా మేరకు తగ్గిపోతాయి అని చెప్పుకోచ్చారు.
ఇప్పటికే చాలా మంది మహిళలు పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ కలిసి చిన్న స్థాయి మహిళలకు నిరుద్యోగ లేకుండా ఏదో ఒక పని అప్పజెప్పి వాళ్లను కూడా పైకి తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం పట్టణాల్లోనే కాకుండా గ్రామాలలోని మహిళలు కూడా ఎంతో ధైర్యంతో ఉత్సాహంగా పనులకు ముందుకు వస్తున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్న మహిళలకు కూడా వ్యాపారవేత్తలు,పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి మహిళల్లో ధైర్యం నింపి వాళ్లని కూడా వేరే స్థాయికి తీసుకు వచ్చేలా కృషి చేయాలని చెప్పుకొచ్చారు.
ఎక్కడైనా సరే సమస్యలు వున్న మహిళలను తల్లిగానో లేదో చెల్లిగానో భావించి వారికి అండగా నిలబడేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది యువకులే భారతదేశంలోని చెప్తున్నారు. అలాంటి ఎక్కువ మంది యువకులు యువకులు ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారవేతలు అలాగే పారిశ్రామికవేత్తలు అన్ని రంగాలలోనూ పురుషులకు ఇచ్చే ఆదరణ మహిళలకు కూడా ఇవ్వాలని కోరారు. కాబట్టి మొదటగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి.
రాష్ట్రంలోని మహిళలందరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని అలాగే నా తరఫునుండి మీకు ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపుతానని అన్నారు. ప్రస్తుతం నేను కూడా ఇవ్వాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎక్కువగా ధైర్యం, సాహసం అలాగే ఓర్పుతో ఇప్పటివరకు ఉన్నాను కాబట్టి ఇవ్వాలి మంత్రి స్థాయిలో ఉన్నాను. కాబట్టి నాలాగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి ప్రతి ఒక్క రంగంలోనూ మీ సాయుద శక్తుల పోరాడి నిలవండి అని చెప్పారు.