Diwali 2024: చీకట్లను చీల్చుకొని వెలుగు తెచ్చే దీపావళి వచ్చేస్తోంది.. పండుగ సందడిలో జనాలు..
ఈ దీపావళి రోజున చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా బాంబులను కాల్చుతూ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తారు. అయితే ఈ చీకట్లో నుంచి వెలుగును ప్రసాదించే దీపావళి పండుగ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టత అనేది లేదు. కొంతమంది పండితులైతే అక్టోబర్ 31వ తారీఖున జరుపుకోవాలని చెప్తుండగా మరి కొంతమంది నవంబర్ ఒకటవ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. అయితే ఇందులో ఏ రోజు జరుపుకోవాలని అనేది మాత్రం ఇంకా ఎవరికీ అర్థం కావట్లేదు.
దీపావళి పండుగకు కేవలం మరొక పది రోజులు మాత్రమే ఉంది. అయినా సరే ఇంకా పండగ ఏ తారీకు అనేది ఎవరికి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. చాలామంది అయోమయంలో కూడా పడ్డారు. అయితే మనం ఇప్పుడు పండితులు అలాగే పురాణాల ప్రకారం ఏ రోజున జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా మనం దీపావళి పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా అశ్వయిజమాసం అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు చాలా మంది కేదారేశ్వర స్వామి వారికి నోములుమరియు పూజలకు నోచుకుంటారు. అయితే పండితులు ప్రకారం అమావాస్య ఏ రోజున వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ఏడాది అనగా 2024 సంవత్సరంలో ప్రదోష అమావాస్య అక్టోబర్ 31 వ తారీఖున మొదలయ్యి నవంబర్ ఒకటవ తారీఖున ముగుస్తుంది. ధీంతో ప్రతి ఒక్కరు కూడా దీపావళి ఏ రోజు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. కానీ వివరాలు ప్రకారం మన పురాణాల ప్రకారం ఇప్పుడు మనం ఏరోజు జరుపుకోవడం మంచిదో తెలుసుకుందాం.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేద క్యాలెండర్ ప్రకారం అమావాస్య అనేది అక్టోబర్ 31 వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈ అమావాస్య అనేది నవంబర్ ఒకటో తారీకున సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు ముగిస్తుంది. ఇక ఆ వెంటనే పాడ్యమి అనేది మొదలవుతుంది. దీంతో చాలామంది పండితులు కూడా అక్టోబర్ 31వ తారీఖున ఇది దీపావళి పండుగని అనేది జరుపుకోవాలని చెబుతూ ఉన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రజలెవరూ కూడా ఇలాంటి ఆచారాలను సరిగా పాటించట్లేదు. మరి కొందరు మాత్రం కచ్చితంగా పేద పండితులు చెప్పిన ప్రకారమే నడుచుకుంటారు. కాబట్టి అక్టోబర్ 31వ తారీకున జరుపుకుంటారు లేదా నవంబర్ ఒకటో తారీకున జరుపుకుంటారనేది చాలామందిలో కూడా అయోమయం నెలకొంది. దృక్ పంచాంగం ప్రకారం కొంతమంది నవంబర్ ఒకటో తారీఖున జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం నవంబర్ ఒకటో తారీఖున అనగా శుక్రవారం బడి దీపావళి గా చాలామంది జరుపుకుంటారు.
అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 31వ తారీఖున దీపావళి పండుగ ఉత్సవములు జరుపుకోవాలని చాలామంది పండితులు చెప్పుకొస్తున్నారు. మన దేశంలో ఎప్పుడూ కూడా దీపావళి అనేది ఒక రోజున జరుపుకుంటారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఒకరోజు ముందుగాను లేదా ఒక రోజు వెనుకగాను జరుపుకుంటారు. ఏది ఏమైనా సరే దీపావళి పండుగ అనేది ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం భారతదేశంలో జరిగే ఎటువంటి ప్రతి పండుగ కూడా పురాణాల ప్రకారం జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆచారాలను పాటిస్తూ మనం పురాణాల ప్రకారం జరుపుతారు. అయితే ప్రస్తుత కాలంలో ఏ పండుగ అయినా సరే ప్రదోషకాలంలో ఆచరించాలి. అదేవిధంగా దీపోత్సవం అనేదిఅమావాస్య రోజు అయినటువంటి తిథి నాడు జరుపుకుంటారు.
కాబట్టి అమావాస్య రోజున నిర్వహించేటువంటి ఈ పండుగకైనా తిథితో ఎటువంటి సంబంధం కానీ ప్రాముఖ్యత కానీ ఉండదు. కాబట్టి ప్రస్తుత ఈ సంవత్సరంలో ప్రజలు ఎటువంటి గందరగోళం లాంటి ఆలోచనలు లేకుండా అక్టోబర్ 31 వ తారీఖున ఈ దీపావళి పండుగ ఉత్సవాలనేవి జరుపుకోవాలని అంటున్నారు. తాజాగా ప్రభుత్వాలు కూడా అక్టోబర్ 31 వ తారీఖున స్కూళ్లకు అలాగే కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే గతంలో కూడా ఇలాంటివి ఎన్నో అందరు బాలులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాల పురాణాలు ప్రకారం వేద పండితులు చెప్పినట్టు విదంగానే నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ అక్టోబర్ 31 వ తారీఖున ప్రతి ఒక్క హిందువు కూడా కుటుంబం మరియు బంధువుల సమక్షంలో ఈ బంధువులను ఘనంగా నిర్వహించి ప్రతి ఒక్కరు పాల్గొనేలా చేయాలని అంటున్నారు.
కాబట్టి ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్టోబర్ 31 వ తారీఖున ఈ పండుగను ఘనంగా చేసుకోవాలని వేద పండితులు చెప్తున్నారు. ఈ వేద క్యాలెండర్ ప్రకారం మన రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 31 వ తారీకు అన్ని స్కూళ్లకు మరియు కాలేజీలకు అలాగే ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా సెలవులు అనేవి ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 31వ తారీకు న దీపావళి పండుగ జరుపుకోవాలి.