Hope: ఆశకు మించిన వ్యాధి మరొకటి లేదు అంటున్న దైవం?
వెలుగులు చిమ్ముతూ సూర్యుడు పొద్దున ఎంతలా ఉదయించిన మాపటికి మౌనంగా అస్తమించాల్సిందే. వసంతం లో ఇన్ని పూల వానలు కురిపించిన, మురిపించిన చివరికి శశిరకాలం రాగానే ఆకులు రాలీ కొమ్ములు విరిగిపోవాల్సిందే. చెట్లకైనా లేదా మనుషుల కైనా కాలనీయమనేది కచ్చితంగా ఒకటే. మానవుడు తప్ప సృష్టిలో అన్ని ప్రాణులు ఇషాశ్వత సత్యాన్ని మర్చిపోకుండా కాలనీమానికి కట్టుబడి మసులుకుంటున్నారు. కానీ ఒక మనిషి మాత్రం నేనే శాశ్వతం అనే భ్రమతో జీవితాన్ని ఎదురీదుతూ పిచ్చి ఆశలతో బతుకుతూ ఉన్నారు. ఆకాశంలో మేఘాలు ఎగిరి ఎప్పుడు కలుసుకుంటూ విడిపోతూ ఉన్నట్లు ఈ ప్రపంచంలోని ప్రాణకోటి మొత్తం కాలచక్రం వల్ల అటు ఇటు ఊగుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు కాలమే అన్నిటికీ మూలం. నిజం చెప్పాలంటే కాలం చాలా విచిత్రమైనది. ఎంతటి వారైనా ఈ కాలమని గడియారాన్ని దాటలేమని చెబుతుంది.
ప్రస్తుత రోజుల్లో మనం చూసుకుంటే మనుషులు అశాంతికి ప్రధాన కారణం ఆశ మాత్రమే. జీవితానికి సంబంధించి మనిషి ఓ ఆశల పల్లకిని ప్రతిరోజు కూడా నిర్మించుకుంటూ నే ఉంటాడు. అంతేకాకుండా రంగురంగుల పూలతో దాన్ని అలంకరించుకుంటూ కూడా ఉంటాడు. అలాగే పల్లకి సాగిపోవాలని ఎక్కడో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరాలని ప్రతిరోజు దేవుళ్లను కూడా ప్రార్థిస్తారు. కానీ చాలాసార్లు ఆ కలలు నెరవేరినప్పుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకే ఆశించే స్థాయిలోనే మనసుని అప్రమత్తంగా ఉండాలి అని అంటారు.
ఈరోజుల్లో చాలా మందికి శాంతి మరియు సంతోషం ఎక్కడ లభిస్తాయి అనేది తెలియదు. చేతిలో వెలుగుతున్న లాంతరును పట్టుకొని నిప్పు కోసం పక్కింట్లో అర్జించే ఎంతో అమాయకుల మాదిరిగా మారిపోతున్నారు. చేతిలో దీపం ఉన్నా కూడా చుట్ట కాల్చుకోవడానికి పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాం. సంతోషం అనేది మన మనసులో ఉంటే దానికోసం కార్లలో బ్యాంక్ అకౌంట్లలో అలాగే మేడల్లో,ఖరీదైన బట్టల్లో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగని వాటిని సంపాదించుకోవద్దని చెప్పట్లేదు. కానీ అవి ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని అనుకోవడం పిచ్చి అవుతుంది.
ప్రతి ఒక్కరు కూడా మరిచిపోయే మరో ముఖ్యమైన విషయం మరణం. అది ప్రతి రోజు దగ్గరవుతుందని మనిషి గుర్తించడం లేదు. మరణించిన వాళ్ళని చూసి పోతున్న వాళ్ళు ఏడ్చినట్లు... చనిపోయిన వాళ్ల ముందు నాలుగు కన్నీరు చుక్కలు కారుస్తూ ఈ లోకాన్ని సాగిస్తున్నారు. కానీ చనిపోయే రోజు తప్పక వస్తుందని.. ఆలోపు తనకోసం తాను బతకడమే కాకుండా కొంతైనా ఇతరుల కోసం సహాయం చేస్తూ బతకాలని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. జీవితం మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా చివరికి మరణించాల్సిందే. నేను నా పిల్లలు, నా మనవులు, నా మనవరాలు మాత్రమే శాశ్వతంగా ఉండి ఈ ప్రపంచాన్ని అనుభవిస్తాం అనంత దీనాలో ప్రస్తుతం చాలా మంది ఉన్నారు.
ఆశ అనేది ఒక పొరపాటు లాంటిది. ఆశ ఉన్నంతవరకు కచ్చితంగా గొడవలు అనేవి తప్పవు. ప్రస్తుత రోజుల్లో ఆశలను తుంచేస్తేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. పురాణాలు ప్రకారం మహానుభావులు చెప్పిన ఆశలపాషాన్ని తుంచేస్తే నైనా మనిషికి మనశ్శాంతి అనేది కలుగుతుంది. గద్ద నోట్లో చేప ఉన్నంతకాలం కాకులు దాన్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా చేపను జార విడిచి కొమ్మపై వాళ్లు నమ్మరు క్షణము దానికి విశ్రాంతి... ప్రశాంతి. అలాగే మనిషికి ఆశలు ఉన్నంతకాలం ఈ పరుగులు తప్పవు అలాగే పాట్లు తప్పవు. ఒక వయసు వరకు సంసారాన్ని ఓ చేతితో, పరమాత్ముడిని మరో చేతిలో పట్టుకోవాలి. అయినవాళ్లంతా ఓ స్థాయికి వచ్చాక రెండు చేతులతో పరమాత్ముని పాదాలనే పట్టుకోవాలి. అప్పుడే మనిషికి ప్రశాంతం అలాగే పరమానందం కూడా.
కళ్ళు చల్లగా ఉండాలంటే అద్దాలు కళ్ళకే పెట్టుకుంటాం. కానీ ఈ ప్రపంచమంతా చల్ల పరచలేము కదా. అలాగే లోకంలో కనిపించేవన్నీ అనుభవించాలన్న ఆశ కన్నా వాటిని కోరుకునే మనసునే కట్టడం చేయాలన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాలి. అప్పుడే మనిషి అనే వాడు ప్రశాంతంగా ఉండగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశలు అనేవి హద్దుకు నుంచి పెట్టుకోకూడదు. అది జీవితానికి చేటు.