Karthika Masam : కార్తీకమాసం వచ్చేస్తోంది.. శివుడికి ప్రీతికరమైన మాసం విశిష్టత తెలుసా?
నిన్న మొన్నటి దాకా దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా చాలామంది భక్తులు అమ్మవార్లకు వివిధ అలంకరణలో పూజలు నియమాలు పాటించి భక్తిశ్రద్ధలతో పది రోజులపాటు అమ్మవారికి నిత్యం భజనలు చేశారు. అయితే ఈ ఉత్సాహం అనేది ఇంతటితో ఆగిపోలేదు. మరో వారంలో మళ్లీ కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసం అనేది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కార్తిక మాసం అనేది ప్రతి ఏటా అక్టోబర్ మరియు నవంబర్ నెలల మధ్యలో వస్తుంది. ఈ ఏడాది 2024వ సంవత్సరంలో అక్టోబర్ 18 వ తారీఖున కార్తీక్ మాసం అనేది మొదలవుతుంది. అలాగే నవంబర్ 15వ తారీఖున ఈ కార్తీక్ మాసం అనేది ముగుస్తుంది. దానధర్మాలకు అలాగే స్నాన ఆచారాలు వీటితో పాటుగా ఎంతోమంది ఆడవాళ్లు ఉపవాసాలకు పెట్టింది పేరు ఈ కార్తీకమాసం. ఎంతోమంది ప్రజలు ఉదయం లేవగానే కార్తీక మాసం అనేది ఈ ప్రారంభం అవ్వగానే ఎవరు ఇష్టపడే వాళ్ళ దేవుళ్లను వారు పూజిస్తూ మళ్లీ భక్తిశ్రద్ధలతో మునిగిపోతారు.
ఈ కార్తీకమాసం మొదలవుగానే చాలామంది వివిధ రకాల వాళ్ల నచ్చిన లేదా మొక్కుబడి ఉన్న దైవ దీక్షులనేవి ఎక్కువగా చేస్తారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఈ కార్తీకమాసంలో అయ్యప్ప మాలలు లేదా శివుడి మాలలు లేదా ఆంజనేయ స్వామి, అమ్మవారి మాలల దీక్షలు అనేవి ఎక్కువగా చేస్తారు. మనం ప్రతి ఏటా కూడా ఈ కార్తీకమాసంలోని ఈ మాలలు వేసుకునేటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. కాబట్టి కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనదిగా అందరూ అంటారు.
కార్తీక్ మాసం అనేది ఇంతటి విశిష్టత ఎందుకు కలిగిందంటే ఈ మాసంలోనే శ్రీ హరి యోగి నిద్ర నుండి మేల్కొంటాడు. అలాగే ఈ మాసం అనేది విష్ణువుకు ఎంతో ఇష్టమైనది. అలాగే ఈ కార్తీక మాసంలోనే సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి విష్ణువు కి పూజలు చేస్తూ కాలాన్ని గడుపుతుంది. కాబట్టి ఈ సమయంలోనే పూజలు చేస్తే వాటికి సఫలమైన ఫలితాలు దక్కుతాయని అందరూ భావిస్తారు. మన పురాణాల ప్రకారం బట్టి కూడా చూస్తే ఈ మాసంలో ఎక్కువగా పూజలు దీక్షలు చేయడం వల్ల వాటికి తగ్గ ఫలితాలు అనేవి దక్కుతాయట.
ఈ మాసంలోని ఎక్కువగా పూజలు చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని అలాగే ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే తీరుతాయని ఎక్కువమంది చెబుతూ ఉన్న విషయాలే కాబట్టి అందరికీ కూడా అర్థం అయ్యే ఉంటుంది. ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్క ఆలయం కూడా చాలా శుభ్రంగా ఉంచుతూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంతోమంది భక్తులు దీపాలతో అలాగే నైవేద్యాలతో ఆలయాలలోని స్వాములకు భజనలు చేస్తూ కాళాన్ని గడుపుతారు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఇష్టమైన దైవాన్ని కొలుస్తూ దాదాపు కొన్ని రోజులు పాటు దీక్షలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ కార్తీక మాసాన్ని ప్రారంభిస్తారు.
మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎవరైనా సరే ఈ కార్తీకమాసంలో పవిత్రమైన నదులలో స్నానం చేయడం వల్ల వారి యొక్క పాపాలు, వినాశనాలు అన్ని తొలగిపోతాయని అందరూ కూడా భావిస్తారు. అలాగే ఈ కార్తీకమాసంలో ఎక్కువగా వివిధ రకాలైన మొక్కలకు కూడా పూజలు చేస్తారు. ఉదాహరణకి తులసి మొక్కలను తీసుకుంటే కార్తీకమాసంలో ఈ తులసి మొక్కలు అనేది ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. దైవంతో పాటుగా ఈ మొక్కలను పూజిస్తారు. కాబట్టే కార్తీకమాసం అనేది ఎంతో విశిష్టంగా భావించబడుతుంది.
అంతేకాకుండా ప్రముఖ క్షేత్రాలైన త్రిపురాంతకం (అమ్మవారు ) శ్రీశైలం (మల్లికార్జున స్వామి), శబరిమల (అయ్యప్ప స్వామి ) ఇలా మొదలుకొని ప్రముఖ శివాలయాలు లో ఎక్కువగా ఈ కార్తీకమాసం పూజలు అనేవి చేస్తారు. కాబట్టి ఈ కార్తీకమాసంలో శివాలయాలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. అయితే ఈ కార్తీకమాసం అనేది అక్టోబర్ 18 సోమవారం నుండి ప్రారంభంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇప్పుడే దసరా ఉత్సవాల నుండి బయటకు వచ్చి మళ్లీ వారం రోజుల తర్వాత నుండి కార్తీక్ మాసంలోకి మళ్లీ వెళ్ళనున్నారు.
దీంతో కార్తీకమాసం ఉత్సవాలనేవి మళ్లీ మొదలవుతున్నాయి. కాబట్టి ప్రజలకు మళ్లీ నిత్యం భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి మరో అవకాశం కలిగింది. ఈ కార్తీకమాసం అనేది ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో మనకి తెలియదు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఘనంగా దీక్షలు,ఉపవాసాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ కార్తీకమాసం చాలా విశిష్టమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగమై నిత్యం వాళ్లకి నచ్చిన దైవాలను పూజిస్తూ ఉంటుంటారు.
ఈ కార్తీక మాసంలో పురుషులు ఎక్కువగా దీక్షలు, మాలలు చేస్తుంటారు. అలాగే స్త్రీలు అయితే ఉపవాసాలు, నైవేద్యాలను స్వామివారికి భక్తితో చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసం అనేది హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం లాంటిది. కాబట్టి ఈ కార్తీకమాసం మొదలవు గానే మళ్లీ అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతాయి. కాబట్టి మళ్లీ మనం ఎక్కువగా భక్తి జనాలను చూడాల్సి వస్తుంది.