Karthika Masam 2024: శివుడికి అత్యంత ఇష్టమైన కార్తీకమాసం విశిష్టత ఏంటో తెలుసా?
ఈ కార్తీకమాసంలో పూజలు మరియు వ్రతాలు అలాగే ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో నెలకొంటుంది. నెలరోజులపాటు వర్మ పరమేశ్వరుడైనటువంటి శివుడిని భక్తుతో పూజిస్తూ ఉంటారు. అలాగే సోమవారాలు మరియు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు అలాగే పూజలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉపవాసం ఉంటూ సాక్షాత్తు అపరమేశ్వరుడి కటాక్షం కోసం వేచి చూస్తూ ఉంటారు. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి అందుకే కార్తీకమాసం అనే పేరు వచ్చింది.
అంతేకాకుండా ఈ కార్తీకమాసంలోని అయ్యప్ప మాలలు అనే దీక్షలు ఎక్కువగా చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళ దైవాన్ని మాల ద్వారా దీక్షలనేవి దాదాపుగా నెలపాటు చేస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్ట గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ ఏడాది కార్తిక మాసం నవంబర్ 15న వస్తున్నది. ఆరోజున నదుల్లో స్నానాలు చేసే శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.
అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపాలను వెలిగించి సాక్షాత్తు ఆ మహాశివుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక్ దీపాలను నదుల్లో కూడా వదులుతారు. కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్లి పూజలు చేసేది ఎందుకంటే దోషాలు తొలగిపోతాయని అలాగే బాధలు ఉండవని నమ్మకంతో చేస్తారు. అలాగే ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఇంటి చీకటితో పాటు జీవితంలో అలుముకున్నా చీకట్లు కూడా తొలగిపోతాయని...అంతేకాకుండా లక్ష్మీదేవి సంతోషించి ఇంటిని సిరిసంపదలతో నింపుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తారు. ఈ కార్తీకమాసంలోని ఒక నెలపాటు తులసి చెట్టు ఎదుట దీపం పెడితే అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు చాలా విధాలుగా చెప్పారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కూడా పూజలు చేస్తుంటారు.
ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైందని చెప్తారు. అందుకే చాలామంది ఉసిరి చెట్ల కింద భోజనాలు చేస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉసిరి చెట్టు కింద కార్తిక దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తిగా ఇష్టమైన దైవాలకు ప్రతిరోజు నిత్యం పూజలు అలాగే దీపరాధనలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా మాల ధరించేటువంటి భక్తులు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో ఆచారాలను పాటిస్తూ దైవ భక్తుని చాటుకుంటారు.
కాబట్టి ఈ కార్తీకమాసం అనేది ఎంత విశిష్టమైనది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు ఆ దేవులకే ఈ కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టమైనదని ఎన్నో పురాణాల్లో అలాగే మన వేద పండితులు కూడా చెబుతున్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక్ మాసంలో వాళ్లకి తోచినంతగా దైవ భక్తి లో మునిగిపోవాలని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తిక మాసంలో ఇష్టంతో వాళ్ల యొక్క కుటుంబ దైవానికి ఘనంగా పూజలు, అభిషేకాలు చేస్తారు.