Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు.. ఏమన్నారంటే..
ఎవరైనా సరే కోడి ముందు పుట్టింది అని అంటే వాళ్లని మరి కోడి పుట్టడానికి గుడ్డు ఎక్కడ నుంచి వచ్చిందనే ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. అదే ఒకవేళ గుడ్డు ముందు అని అంటే మరి గుడ్డు పెట్టడానికి కావలసినటువంటి కోడి ఎక్కడిది అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అయోమయంగా ఉంటుంది. అయితే ఈ ప్రశ్నపై ఈ చాలా తర్వాత సమాధానమనేది లభించింది.
కోడి ముందా? లేక గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం అయితే లభించింది. జెనీవా విశ్వవిద్యాలయంలో జీవ రసాయన శాస్త్రవేత్తగా పేరుపొందిన ఓలివేట్ట నేతృత్వంలో ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ భూమ్మీద జంతువుల ఆవిర్భావానికి ముందే ఒక పిండం లాంటి నిర్మాణం ఏర్పడిందని అదే అనేక రూపాంతాలు చెంది జీవుల పుట్టుకకు కారణమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ సూత్రీకరణ ప్రకారం కోడి అనేది ముందు కాదని కేవలం గుడ్డు మాత్రమే ముందు ఏర్పడిందని అంతేకాకుండా ఇవి అనేక రూపాంతరాలు చెంది కోడి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అధ్యయన ప్రకారం తెలిసింది.
కాబట్టి గుడ్డేముందని ప్రస్తుతం సమాధానం వినిపిస్తుంది. ఈ విశ్వం ఏర్పడిన అనంతరం జీవి పుట్టుకకు ముందు పిండం లాంటి పదార్థం ఏర్పడి ఉంటుందని అదే అనేక రూపాంతరాలు చెంది ఒక జీవి లాగా ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాబట్టి ఈ స్పష్టతతోనే ప్రస్తుతం మేము ఉన్నామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.