Juice Corner: తక్కువ పెట్టుబడి తో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా!.. అయితే ఇది ట్రై చేయండి?
ఇక ప్రతిరోజు దినచర్యలో జ్యూస్ ని జోడించడం వల్ల మన ఆరోగ్యానికి అలాగే శ్రేయస్సుకు కూడా చాలా ముఖ్యం. ఇక భారతదేశంలో కోవిడ్ తర్వాత ఆరోగ్యం పై చాలామంది దృష్టి పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ తరహా లోనే జ్యూస్ దుకాణాలు పెట్టడం వల్ల మంచి ఆదాయం కూడా పొందవచ్చు అని చెప్తున్నారు. ఈ వ్యాపారం వల్ల మంచి లాభంతో పాటు మీ వ్యాపారాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా ఫిట్నెస్ ఉండాలనుకునే వారి దగ్గరలో ఈ షాపులను పెడితే మాత్రం ఇక ఆదాయం మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రోటీన్ షేకులను ఎక్కువగా అమ్ముతూ కూడా మీ మార్కెట్ను మరింత విస్తరించవచ్చును.
ఇక మీరు ఈ జ్యూస్ కార్నర్ ను ప్రారంభించడానికి ఎక్కువగా ఖర్చు ఏమి కాదు. ఈ షాపుకు కావలసినటువంటి పరికరాలను కొనుగోలు చేయడానికి ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు అనేది పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్లోని ఈ మధ్య తరహా దుకాణం అలాగే అవసరమైన పండ్లు, పరికరాలతో కూడిన వ్యాపారం మీకు పెద్దగా ఖర్చును పెంచదు. ఇక మీరు ఫుడ్ అథారిటీ నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే మీరు మీ దుకాణాన్ని ప్రారంభించాలి.
ఇక ఎక్కువమంది మీ కస్టమర్స్ గా అవ్వాలంటే కచ్చితంగా మీరు రకరకాల జ్యూస్ లు అమ్మాలి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆఫర్లను అందించడం వల్ల ఎక్కువ మంది మీ దుకాణం వైపు మొగ్గు చూపుతారు. అంతేకాకుండా మీరు ఒక గ్లాస్ రసం పై 50 నుంచి 70% వరకు నికర లాభాన్ని అనేది పొందవచ్చు. ఇక రోజులో మొత్తం 5000 రూపాయల జ్యూస్ లు విక్రయిస్తే మీకు అందులో 1500 నుంచి 2000 వరకు మిగలవచ్చు. కాబట్టి ఈ నెలకి 60 నుంచి 70000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు.