Artificial Intelligence: భవిష్యత్తులో ఏఐ ఎటువంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా ?
ఏఐ అనేది అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాలు నష్టం అనేది తక్కువే అంటూ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని అలాగే ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఇక మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే కచ్చితంగా వ్యాపార సంస్థలనేవి కొత్త కొత్త టెక్నాలజీలను కచ్చితంగా వాడుకోవాలని అనుకుంటుందని ఆమె అన్నారు.
పెద్దపెద్ద సవాళ్లను ఈ టెక్నాలజీలపరంగానే మనం ఎదుర్కోగలమని ఖచ్చితంగా వీటిని అర్థం చేసుకొని ఏ విధంగా వినియోగించుకోవాలో అది తెలుసుకొని ఉపయోగించాలని సూచించారు. అంతేకాకుండా ఎటువంటి నష్టాలు అయితే ఉండవు కానీ ఏఐ మిషన్కు అలాగే నైపుణ్యాలు పెంపునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఇక ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్ గా పనిచేస్తున్న గంగాధర్ ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 2500 నుంచి 3000 వరకు ఉద్యోగాలను పెంచుకుంటున్నట్లు చెప్తున్నారు. బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాదు వంటి ముఖ్య నగరాలలో ఎస్సి ఏపీకి కేంద్రాలు ఉన్నాయి.