Digital Payment: ఎలా పడితే అలా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చాక పది రూపాయలు చెల్లించాలన్న మనం సులభంగా యూపీఐ ని వాడుతున్నాం. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఎకౌంట్లో కనపడుతుందని ఎవరు కూడా మర్చిపోవద్దు.
ఒక ఏడాదికి మనం కనుక పది లక్షలు కంటే ఎక్కువగా ఖర్చు చేసిన లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి వాటి ద్వారా పది లక్షల గురించి ఖర్చు చేసినా కూడా బ్యాంకులు మన వివరాలను పన్ను శాఖకు ఆటోమేటిక్గా అందిస్తుంది. కాబట్టి మన ఖాతాలో పెద్ద మొత్తంలో ఎప్పుడైతే డబ్బులు డిపాజిట్ చేస్తామో అప్పుడు మనం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిమితులకు మించి డిపాజిట్లు చేపట్టినా సైతం పన్ను శాఖ నుంచి నోటీసులు పంపించే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుతం 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అనేది ఇవ్వాలి. ఒకవేళ 50,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్ చేయాలంటే కచ్చితంగా మనం మన పాన్ కార్డు వివరాలు అనేది సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క డిపాజిట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా పన్ను శాఖ అధికారులు దృష్టికి వెళ్తాయని అందరూ గుర్తించుకోవాలి.
అలాగే ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి కోటి రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే టీడీఎస్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే బ్యాంకుల్లో ఒకేసారి రెండు లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిగినా కూడా ఈ ఆదాయపు పన్ను నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఇక నిబంధనలను ఉల్లంఘించిన వారికి కచ్చితంగా జరిమానవీధించేటువంటి అవకాశం అయితే ఉంది.
మీరు కచ్చితంగా 50,000 కంటే ఎక్కువగా మనీ ని డిపాజిట్ చేయాలన్నా లేదా విత్ డ్రా చేయాలన్నా కచ్చితంగా పాన్ కార్డు ఉపయోగించాలి. ఇలా పాన్ కార్డు లేకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసిన లేదా విత్ డ్రా చేసిన ఈ ఆదాయపు పన్నుపై నోటీసులు వచ్చె అవకాశాలు ఉన్నాయి.