Masked Aadhaar: మాస్క్ డ్ ఆధార్ కార్డుతో సైబర్ నేరగాళ్ల నుంచి ప్రొటెక్షన్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా!
కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు అనేది ఎంతో అవసరం. ఇలాంటి ఆధార్ కార్డును ఇతరులు సులభంగా కొంతమంది ఈ సైబర్ నేరగాళ్లు మోసం చేసి ఎకౌంట్ల లోని డబ్బులను దోచేస్తున్నారు. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే మాస్క్డ్ ఆధార్ కార్డు అయితే ఉపయోగించాలి. అసలు ఈ మాస్క్ ఆధార్ కార్డు అంటే ఏంటి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం.
కేంద్రం తాజాగా మాస్కుడు ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఎప్పుడైనా ఈ కేవైసీ మాత్రమే ఇవ్వాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించవచ్చని కేంద్రం కోరింది. ఎందుకంటే మీ ఫోటో కనపడకుండా అలాగే 12 నెంబర్లు గల ఆధార్ కార్డు నెంబర్లలో చివరి 4 అంకెలు మాత్రమే కనపడేలా ఈ మాస్క్ డ్ ఆధార్ కార్డు తయారు చేశారు. ఈ మాస్కుడు ఆధార్ కార్డు ఉపయోగించడం వల్ల ఇతరులు అలాగే సైబర్ నేరగాళ్లు ఎవరూ కూడా మీ నెంబర్ అనేది దుర్వినియోగం చేయడానికి అవకాశం అనేది ఉండదు.
ఇప్పుడు మీరు మాస్క్డ్ ఆధార్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అధికారిక వెబ్సైట్ అయినటువంటి UIDAI అనే వెబ్సైటు ఓపెన్ చేసాక అందులో మీ ఆధార్ నెంబర్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయాలి. ఇక తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి దాని కింద క్యాప్చ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డు కావాలా లేదా మాస్క్డ్ ఆధార్ కార్డు కావాలనే రెండు ఆప్షన్లు వస్తాయి.
మీరు మాస్క్డ్ ఆధార్ కార్డు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఇకపోతే మీరు దీనిని పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎలా అంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు అలాగే మీ పుట్టినరోజు సంవత్సరాన్ని కలిపి టైప్ చేస్తే అదే మీ పాస్వర్డ్. కాబట్టి ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి మోసానికి గురుకారు.