Food: మూడు పూటలా ఆహారం తినడం లేదా..? అయితే వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?
మనలో చాలామంది ఆకలిగా లేదని లేదా బరువు తగ్గాలని ఇలా ఏదో ఒక కారణం చేత మధ్యాహ్నం లేదా రాత్రిపూట భోజనం అనేది తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. కొందరైతే తినేందుకు సమయం లేక భోజనం అనేది మానేస్తూ ఉంటారు. అయితే ఈ భోజనాన్ని స్కిప్ చేయడం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు కూడా లంచ్ లేదా డిన్నర్ ను తీసుకోకపోవడం వల్ల మీ శరీరానికి కావలసినటువంటి కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్స్ అలాగే విటమిన్స్, సరైన పోషకాలు అనేవి కోల్పోతారు.
దీని ద్వారా చాలా అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఎక్కువగా అలసట మరియు బలహీనతలకు దారితీస్తుంది. మీరు ఏ పని ప్రారంభించాలన్న అందులో చురుగ్గా ఉండలేరు . ఏకాగ్రత కోల్పోయి మొత్తానికి డీలపడిపోతారు. మధ్యాహ్నం పూట భోజనం తినకుండా ఉండడం వల్ల రాత్రి సమయాల్లో అతిగా తినడానికి ఆశపడతారు. ఇక దీంతో మీరు ఫుడ్ ను తీసుకోవడంలో కంట్రోల్ కోల్పోతుంది. దీని ఫలితంగా మీరు అధిక బరువును పొందుతారు.
ఇకపోతే పదే పదే భోజనం అనేది చేయకుండా ఉండడంవల్ల విటమిన్లు మరియు మినరల్స్ ను లాస్ అవుతారు. ఇది శరీర పనితీరుకు ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు అలాగే రక్తహీనత మరియు బలమైన ఎముకలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దోహదపడతాయి. ప్రతి ఒక్కరు కూడా మూడు పుట్ల సరైన ఆహారం అనేది కచ్చితంగా తీసుకోవాలి. తరచూ భోజనాన్ని మానేస్తూ ఉంటే మీ జీవక్రియ రేటు అనేది నెమ్మదిస్తూ ఉంటుంది.
అలాగే ఏదో ఒక నిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. ప్రతిరోజు కూడా లంచ్ అలాగే డిన్నర్ మానేసినప్పుడు ఒక్కొక్కసారి చిరాకు మరియు మూడ్ స్వింగులకు దారితీస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పూర్తిగా పడిపోతాయి. భోజనం మానేయడం వల్ల కడుపు ఉబ్బరం అలాగే వికారం మరియు యాసిడ్ రిప్లెక్స్ వంటి జీర్ణ క్రియ సమస్యలు సైతం మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూడు పూట్ల కూడా ఏదో ఒక ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.