Motor Insurance: మీ వాహనం ప్రమాదానికి గురయ్యాక ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?
మీరు మొదటగా ఎప్పుడు జర్నీ చేసిన సరే మీ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదో చెక్ చేసుకొవాలి. ఎప్పటికప్పుడు బీమా రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. మీ వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే మొదటగా సమీప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అలాగే ఎఫ్ఐఆర్ చేసిన ఆ కాపీ ని తప్పకుండా తీసుకోవాలి. ఇక సాక్ష్యం కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఫోటోలు మరియు వీడియోలు తీయండి. ఎందుకంటే ఆ నష్టం ఎంత జరిగిందో తెలియడానికి ఫోటోలనేవి స్పష్టంగా సాక్ష్యం గా ఉపయోగపడతాయి. తర్వాత వాహన బీమా తీసుకున్నా సంస్థ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ డాక్యుమెంట్లు అయినటువంటి పాలసీ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్ఐఆర్ కాపీ, మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటివి అన్నీ అప్లోడ్ చేయాలి. చివరిగా క్లైమ్ ఫారం ను పూర్తి చేసి సబ్మిట్ అనేది చేయాలి.
ఇక ఆ తర్వాత ప్రమాద ఆధారాలు అన్నింటినీ చెక్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఒక కన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారు. బీమా సంస్థ పాలసీలను బట్టి చెకింగ్ జరగడానికి కొంత సమయం అయితే పట్టవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భీమ సంస్థ నుండి బీమా క్లెయిమ్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే మీ వాహనాన్ని రిపేర్ చేయించాలి. కాబట్టి బీమా క్లైమ్ అయిన తర్వాత మీ వాహనానికి అయ్యేటువంటి ఖర్చునంత కూడా ఈ బీమా సంస్థ మీ బిల్లులను కచ్చితంగా చెల్లిస్తుంది.