Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?
తాజాగా ఈ కొత్త నిబంధన ప్రకారం, జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఉపయోగించే ప్రైవేటు వాహనదారులు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వాహనాలకు ఎటువంటి టోల్ పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదని అన్నారు. అయితే 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణించిన వాస్తవ దూరము ఆధారంగా టోల్ చెల్లించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ నిబంధన అనేది దేశం మొత్తానికి వర్తిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం, ఈ వ్యవస్థ అనేది కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక రాష్ట్రాల్లో నే పైలెట్ ప్రాజెక్టులు అమలు చేయబడింది. ఫాస్ట్ ట్యాగ్ తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం అనగా (జి ఎన్ ఎస్ ఎస్ ) ఆధారిత టోల్ సిస్టం అమలు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితం ప్రణాళికలు వేసింది. కర్ణాటకలోని బెంగళూరు - మైసూరు జాతీయ రహదారి 2007 మరియు హర్యానాలోని పానిపట్ - హిసార్ జాతీయ రహదారి అయినటువంటి 709 లో పరీక్షించబడుతోంది. ఇది విజయవంతమైన తర్వాతనే దేశంలోని ఇతర రహదారులపై దీని అమలు చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఇప్పటికే దేశంలో చాలామంది వాహనదారులు టాక్సీ ఫీజుల ద్వారా చాలా డబ్బును కోల్పోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద ఎత్తున పనులు ఎత్తివేసేలా ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకురావాలని వాహనదారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు ఎక్కువ మొత్తంలో డబ్బును అనేది కోల్పోతున్నారు. సంపాదించిందంతా కూడా వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తుందని లబోదిపోమంటున్నారు.