Angry: ఇతరులపై కోపం వస్తుందా?.. అయితే ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకండి?
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు నష్టపోయాను, ఎందుకు బాధపడుతున్నాను, ఎందుకు కోప్పడుతున్నానని అని ఆలోచనను మనకు మనమే ప్రశ్నించుకుని పరిష్కారాన్ని వెతుక్కోవాలి. జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా బాధ్యత తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. అంతేకానీ ఎదుటివారిని తిట్టడం, మనం చేసిన తప్పుని ఇతరుల పై నెట్టడం ఇలాంటివి అసలు చేయకూడదు.
జీవితంలో ఎదురైనా ఎదురు దెబ్బలు అన్నిటిని కూడా మనం కచ్చితంగా అనుభవించాలి. ఎందుకంటే వీటి నుంచి మనం ఎన్నో విషయాలను కూడా నేర్చుకోవచ్చు. చెడు చేసిన వారిని కూడా ఎదురైనా ఓ గుణపాఠంగానే భావించాలి. దీనివల్ల మనం నేర్చుకున్న విషయాలను భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలి. మళ్లీ అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ఇప్పటి గుణ పాటాలు తోడ్పడుతాయి. జీవిత ప్రయాణంలో నిరంతరం సానుకూల దృక్పథంతోనే ఉండాలి.
ప్రశాంతతో అలాగే స్పష్టతతో ఆలోచించడం ఇప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మనం అన్నిటిని కూడా అనుభవించగలం. ఎదురు దెబ్బలు తగిలాయెనో లేదా ఇతరులు మోసం చేశారని నెగిటివ్ ఆలోచనలు మునిగిపోతే మాత్రం అంతే సంగతి. పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రతి క్షణం కూడా కొత్త పరిణామం నుంచి కొత్త విషయాలు నేర్చుకుని జీవన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తేనే అసలైన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది.