Gaddam: పురుషులు నవంబర్లో ఎందుకు గడ్డం చేసుకోరు?.. దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?
ప్రతి ఒక్కరు కూడా గడ్డం లేదా మీసం కటింగ్ చేయించుకోవడానికి ప్రతి మగవాడు కూడా బాగానే ఖర్చు పెడుతుంటారు. ప్రపంచంలో సెలూన్స్ మరియు మెన్స్ బ్యూటీ పార్లర్ ఆదాయం దాదాపు కోట్లలోనే ఉంటుంది. ఇంత మొత్తాన్ని నెల అంతా ఖర్చు చేయకుండా దాచి పెట్టడం వల్ల మనం క్యాన్సర్ పేషెంట్స్ లకు దానం చేసిన వాళ్లమవుతాం. ఇలా నెల మొత్తం సేవ్ చేయించుకోకుండా దాచిపెట్టిన డబ్బులను క్యాన్సర్ పేషెంట్లకు డొనేట్ చేయాలని కోరింది.
ఇక ఇలానే డొనేట్ ఎందుకు చేయాలంటే క్యాన్సర్ పేషెంట్లకు థెరపీలు మరియు రేడియేషన్ ల వల్ల పూర్తిగా జుట్టు అనేది ఊడిపోతుంది. అలాంటి వాళ్లకు ఇది ఒక సింబాలిక్ సపోర్టుగా ఉండేందుకు వెంట్రుకలు మరియు గడ్డం తీయకుండా ఉండే ఛాలెంజ్ను క్రియేట్ చేశారు అమెరికాకు చెందిన సెయింట్ జాడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు. ఇక వెంట్రుకలు మరియు గడ్డం తీయకుండా ఉండే ఛాలెంజ్ వల్ల సేవ్ చేసిన డబ్బు మొత్తాన్ని కూడా (noshave.org) అనే వెబ్సైట్ ద్వారా డొనేట్ చేయొచ్చు అని తెలిపారు.
ఇకపోతే గడ్డం పెంచితే బాగోదు అని ఒకప్పుడు చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు. కానీ కొన్ని నీళ్లుగా గడ్డం స్టైల్ బాగా ట్రెండ్ గా అవుతుంది. యూత్ అందరు కూడా రకరకాల స్టైల్స్ లో గడ్డం పెంచుతూ మరింత ట్రెండీగా తయారవుతున్నారు. ఒకప్పుడు క్లీన్ షేవ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇప్పుడు గడ్డం పెంచడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక గడ్డం వల్ల అందమే కదా ఆరోగ్యంగానే ఉండవచ్చు అని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
సూర్య కిరణాల ద్వారా వచ్చే అల్ట్రావైలెట్ కీకిరణాలు ముఖంపై పడకుండా గడ్డం అడ్డుకుంటున్నట్లు కొన్ని పరిశోధనలలో తేలింది. అలాగే అస్తమా మరియు దుమ్ము,ధూళి అలాగే డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్న వారుకి గడ్డం బాగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా తెలియని వారికి తెలియజేసి ఈ నవంబర్ నెలలో గడ్డాన్ని పెంచేసి తద్వారా దాచిపెట్టినటువంటి డబ్బుని ఈ (noshave.org) వెబ్సైట్ ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు దానం చేయాలని కోరుతున్నాం.