BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
అయితే వీటికి వేరుగా ఇంటర్నెట్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అలా కాదు మీరు ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ని ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇది దాదాపుగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి కేబుల్ టీవీ లాంటిదే. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ IFTV సర్వీస్ తో మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెచ్డి నాణ్యత తో ప్రత్యక్షంగా టీవీ ని చూడవచ్చు. మీరు ఇలా చూడాలంటే బిఎస్ఎన్ఎల్ FTTH కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ తోనే మీరు లైవ్ టీవీ ఛానల్ లను యాక్సిస్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఏవైతె ఓటిటిస్ ఉన్నాయో ఉదాహరణకి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్, ఆహా, జి ఫైవ్ ఇలాంటి ఓ టి టి యాప్ లన్ని కూడా కస్టమర్లకు ఉచితంగా ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు అని అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ కల్పించింది. కాబట్టి మీరు ఇంటర్నెట్ చార్జీలు చెల్లించకుండానే ఓటిపి ఆకులను ఉపయోగించవచ్చు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ఆప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే ఆండ్రాయిడ్ టీవీ కస్టమర్లు ఉంటారో వారు మాత్రమే ఈ ఛానల్ ఆఫర్లు పొందగలరు.
మరి ముఖ్యంగా ఈ బిఎస్ఎన్ఎల్ సేవా కేబుల్ టీవీ మరియు సెటప్ బాక్స్ లేకుండానే ఇలాంటి ప్రయోజనాలు అందిస్తుండడంతో అందరూ ఈ సంస్థపై మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ సేవా భారత దేశంలో తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రారంభించబడింది. త్వరలోనే ఇతర రాష్ట్రాలలో కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని తెలిపారు.