Beautiful Tips: అమ్మాయిలూ అందంగా మెరువాలనుకుంటున్నారా.. అయితే డైట్‌లో వీటిని వాడండి..
పోషకాలు మరియు విటమిన్లు అలాగే ఖనిజాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.
కాబట్టి మనం ఫుడ్ లో ఇలాంటివి కొన్ని ఆహార పదార్థాలు యాడ్ చేసుకోవడం వల్ల అందమనేది దెబ్బతినకుండా ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు చర్మం కూడా పాడైపోతుంది. అదే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అంతం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. మరి అందంగా ఉండాలంటే ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆ పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాగులు :-
మనం ఆహార పదార్థంలో రాగులు అనే పదార్థాన్ని యాడ్ చేసుకున్నట్లయితే కచ్చితంగా మనం చర్మం అనేది సౌందర్యంగా వెలిగిపోతుంది. రాగుల్లో విటమిన్లు, క్యాల్షియం, పోషకాలు మరియు కణజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంతోపాటు శరీరారోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. రాగుల్లో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో ఇవి ఒత్తిడిని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర అనేవి పోషిస్తాయి. మన డైలీ లైఫ్ లో తప్పకుండా రాగులను ఏదో విధంగా యాడ్ చేసుకోవడం వల్ల యంగ్ లుక్ లో ఉన్నట్లు కనిపిస్తారు.
మెంతులు:-
వంటలకు ఎక్కువగా ఉపయోగించే మెంతుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేయడంతో పాటు ఇందులో పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లో ఇనుము మరియు కాల్షియం అలాగే మెగ్నీషియం లాంటివి అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచడంతోపాటు స్కిన్ పై మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఇలా మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాటర్ ఎక్కువగా తాగలేని వారు మెంతులు కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు.
నల్ల నువ్వులు :-
నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వులను డైలీ డైట్ లో యాడ్ చేసుకుంటే శరీరానికి రక్తం కూడా ఎక్కువగా చేకూరుతుంది. అయితే నల్ల నువ్వుల్లో కాల్షియం మరియు మెగ్నీషియం అలాగే ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. మొటిమలు మరియు మచ్చలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండేటువంటి ఒమేగా త్రీ పాటి ఆసిడ్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నల్ల నువ్వులలో ఎక్కువగా పీచు అనేది ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
గమనిక :- ఈ సంవత్సరం కేవలం అవగాహన మరియు ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఈ సూచనలు మీరు పాటించే ముందు కచ్చితంగా వైద్యునిపుల సలహాలు అయితే తీసుకోవాలి.